అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసంతకం దీనిపైనే చేస్తా: జగన్

ఎప్పుడైతే చంద్రబాబు కళ్లు వీటిపై పడ్డాయో.. అప్పటి నుంచే ఇలా జరుగుతోందని జగన్ చెప్పారు.

మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేసే తొలిసంతకం వాలంటీర్లను పునరుద్ధరించడంపైనేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ.. తాను మళ్లీ అధికారంలోకి వస్తేనే ఇంటికి నేరుగా పెన్షన్లు వస్తాయని చెప్పారు.

తాను అధికారంలో ఉంటేనే తాను అందించిన పథకాలు అన్ని మళ్లీ కొనసాగుతాయని జగన్ తెలిపారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నానని చెప్పారు. ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. అప్పటి నుంచి పెన్షన్లు అందుకోవడంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ప్రతి నెల ఒకటవతేదీన సూర్యుడు ఉదయించేలోపు అందాల్సిన పెన్షన్లు ఆ సమయంలో పడకుండా బంద్ అయిపోయాయని జగన్ తెలిపారు. అంతటితో ఈ చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆగిపోలేదని వ్యాఖ్యానించారు. బ్యాంకుల చుట్టు వృద్ధులు తిరిగేలా ఎండలో నడిరోడ్డుపై పడేలా చేశారని విమర్శించారు.

ప్రజలు 14 ఏళ్లపాటు చంద్రబాబు పాలన చూశారని, 57 నెలల జగన్ పాలన చూశారని జగన్ తెలిపారు. అప్పట్లో ఏరోజైన లబ్ధిదారుల ఇంటికి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపారా అని నిలదీశారు. ఒక నెల ఓపిక పట్టాలని, మళ్లీ తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న ఈ పెద్దమనిషి చెప్పుకోవడానికి ఒక్క పథకమైన ఉందా అని అడుగుతున్నాను. 2014లో మ్యానిఫెస్టో మాయ చూపించి ప్రజలను మోసం చేశారని తెలిపారు.

Also Read : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చేదు అనుభవం.. తిరగబడిన మహిళలు, ఎందుకంటే..

ట్రెండింగ్ వార్తలు