Bhuma Akhila Priya : భూమా అఖిల ప్రియ, భర్త భార్గవ్ రామ్‌లపై హత్యాయత్నం కేసు నమోదు

భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

Bhuma Akhila Priya Nandyala incident : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ లపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంగళవారం (మే16,2023) కొత్తపల్లి వద్ద అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారనే ఆరోపణలో అఖిల ప్రియతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన పాణ్యం పీఎస్ కు తరలించారు. అలా సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గాలకు జరిగిన ఈ ఘర్షణ కాస్తా కేసుల వరకు వెళ్లటం అనంతరం అఖిలను ఆమె అనుచరులను అరెస్ట్ చేసేవరకు వెళ్లింది. దీంట్లో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. భార్యాభర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం భార్గవ్ రామ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. అఖిల ప్రియను ఆమె అనుచరులను అరెస్ట్ చేయటంతో స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bhuma Akhila Priya : చిన్న పిల్లాడిని ఎత్తుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చిన భూమా అఖిల ప్రియ..

కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మద్య ఎంతో కాలంనుంచి వర్గపోరు కొనసాగుతోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. భూమా అఖిల ప్రియ తండ్రి నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. నాగిరెడ్డి మరణం తరువాత ఈ వాతావరణం అంతా మారిపోయింది. వర్గాలుగా విడిపోయి విమర్శలు..ప్రతి విమర్శలతో వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. అది అంతకంతకు పెరుగుతోంది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు అంతకంతకకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. ఈక్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ అగ్రనేత లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుండగా ఈ రెండు వర్గాల మధ్యా విభేధాలు రచ్చకెక్కాయి. కొట్టుకునేవరకు వెళ్ళాయి.

కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రను నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే సమయంలో కొత్తపల్లి వద్ద అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతలకు దారి తీసి అరెస్టుల వరకు వెళ్లింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేస్తు ఆ ప్రాంతాన్ని హీటెక్కించారు. ఈ క్రమంలోనే కొంతమంది సడెన్ గా సుబ్బారెడ్డిపై దాడి చేయగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేయటం అఖిల ప్రియ దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేసే వరకు వెళ్లింది.

Bhuma Akhila Priya : చిన్న పిల్లాడిని ఎత్తుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చిన భూమా అఖిల ప్రియ..







                                    

ట్రెండింగ్ వార్తలు