వారిని వదిలేది లేదు.. ప్రతీఒక్కరిపై క్రిమినల్ కేసులు పెడతాం : మంత్రి నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైతులకోసం సానుకూలంగా స్పందించారు. నాలుగైదు రోజుల్లో రైతులు అకౌంట్లోకి ఆ బాకీలను జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Minister Nadendla Manohar : ఎన్నికల సమయంలో మేము చేసిన వాగ్దానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి మెరుగైన పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రెండోరోజు శనివారం కూడా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. ధాన్యం కనుగోలు విషయంలో అన్యాయం జరిగిందని, అవమానం జరిగిందని రైతులు బాధపడకూడదు.. రైతుని సంతృప్తి పరచడం అధికారుల మీద,  రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉంది. రైతులకు 20 రోజులలోపే డబ్బులు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని మంత్రి చెప్పారు.

Also Read : CM Chandra babu : పింఛ‌న్‌దారుల‌కు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. కీలక విషయాలు వెల్లడి

శాఖ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. శాఖకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము మార్పు తీసుకొస్తాం. ఇక్కడ ఒక వ్యవస్థీకృతమైన మాఫియా మొదలైంది. ఒక కుటుంబం బాగుపడడంకోసం మాత్రమే అందరూ పని చేశారు. కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని రాష్ట్రవ్యాప్తంగా బియ్యం రవాణా చేస్తున్నారు. ఇందులో ఎవ్వర్నీ మేము వదలం. అందరూ శిక్షకు సిద్ధపడాల్సిందే అంటూ మంత్రి హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నుండి పది టీములు ఏర్పాటు చేసి రైస్ మిల్లులు, గోడౌన్ లపై రైడ్ చేశాం. ఆరు చోట్ల స్పష్టమైన పీడీఎఫ్ రైస్ దొరికాయి. సుమారు 7600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని మంత్రి చెప్పారు.

Also Read : అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజులు పాటు హరహర మహాదేవ స్మరణతో మార్మోగనున్న హిమగిరులు

రెవిన్యూ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రంలో ఏం జరుగుతుందో అనే అంశాన్ని పరీక్షించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. కాకినాడ పోర్ట్ అంటేనే ఈరోజు అందరూ భయపడుతున్నారు. సొంత వెసల్ మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగారు. ఇతర రాష్ట్రాల్లో వీళ్ళకి ఎకౌంట్లు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల నుండి సరుకులు తీసుకొస్తున్నారు. గత పది రోజుల నుండి నా పర్యటన ఉందని తెలుసుకుని స్టాక్ ఇక్కడ నుండి తరలించారు. అక్రమాల్లో ప్రమేయంఉన్న ప్రతీఒక్కరిపైన క్రిమినల్ కేసులు పెడతాం. అక్రమ బియ్యం వ్యాపారంపై సీఐడీను కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రతి మూడు రోజులకు ఒకసారి శ్వేత పత్రాన్ని విడుదల చేయబోతున్నామని మంత్రి అన్నారు.

రైతుల బకాయిల విషయంలో 1600 కోట్ల రూపాయలలో ముందుగా వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైతులకోసం సానుకూలంగా స్పందించారు. నాలుగైదు రోజుల్లో రైతులు అకౌంట్లోకి ఆ బాకీలను జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు