Draupadi Murmu : నేడు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము రాక

మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని.. అందుకే మద్దతు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్‌కలాంకు సైతం టీడీపీ మద్దతు ప్రకటించిందని.. ఇప్పుడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళకు అవకాశం వచ్చినందున మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు.

Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతారు. తనకు మద్దతివ్వాలని జగన్‌ను కోరనున్నారు ముర్ము. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్‌ ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఇస్తారు. అటు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విషయంలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరలేదన్న బీజేపీ నేత సత్యకుమార్‌కు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ద్రౌపది ముర్ముకు మద్దుతు ఇవ్వమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారన్నారు. ముర్ము నామినేషన్‌కు జగన్‌ను పీఎంవో ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. అటు సత్య కుమార్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ ఖండించారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరామన్నారు.

Chandrababu Key Decision : రాష్ట్రపతి ఎన్నికలు.. టీడీపీ మద్దతు ఎవరికో చెప్పేసిన చంద్రబాబు

మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని.. అందుకే మద్దతు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్‌కలాంకు సైతం టీడీపీ మద్దతు ప్రకటించిందని.. ఇప్పుడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళకు అవకాశం వచ్చినందున మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు. అయితే టీడీపీ నేతలను ముర్ము కలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణలో ద్రౌపది ముర్ము పర్యటన రద్దైంది.

ట్రెండింగ్ వార్తలు