Minister Amarnath : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ హిరో, చంద్రబాబు విలన్ : మంత్రి అమర్నాథ్

గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.

Minister Amarnath

Pawan Kalyan – Chandrababu : పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుపై మంత్రి అమర్నాథ్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని వెబ్ సిరీస్ అనుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో హీరో.. కానీ, రాజకీయాలలో సైడ్ హిరో, చంద్రబాబు నాయుడు విలన్ అని పేర్కొన్నారు. మొన్నటి వరకు పార్ట్-1 అయింది.. ఇప్పుడు వారాహి పార్ట్-2 అంటా అని విమర్శించారు.

ఈ మేరకు ఆదివారం విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని తెలిపారు. “చంద్రబాబు నాయుడును నీ భుజాల మీద మొయ్యడానికి ఓ రాజకీయ పార్టీ అవసరమా పవన్ కళ్యాణ్” అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి ఉందా అని నిలదీశారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు.

Pawan Kalyan : గ్యాప్ లేకుండా మళ్ళీ పవన్ వారాహి మొదలు.. మరి షూటింగ్స్ ఎప్పుడు?

13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. టూరిజంకి సంబంధించిన 5 స్టార్+ రిసార్ట్స్ హోటల్స్ గండికోట, భీమిలి, తిరుపతి వద్ద MoU చేసుకున్నామని వెల్లడించారు. ఇవే ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. అలాగే మూడు పోర్టులు కూడా సిద్దం అవుతున్నాయని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు