Kanaka durga temple
Shakambari festival : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మ, యాపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవస్ధానం ప్రాంగణం, శ్రీ అమ్మవారి ఉపాలయాలలోని దేవతా మూర్తులకు, ఉత్సవ మూర్తులకు కూరగాయలు, పండ్లతో ఆలయ అర్చకులు అలంకరణ చేశారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలంకరణతో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లు, నిమ్మకాయలతో అలంకరించారు.
దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షించారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.
Also Read : అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్తరకం మొక్కను గుర్తించిన పరిశోధకులు.. దానిపేరు ఏమిటంటే?
భూలోకములో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రజలు, రైతులు సుఖశాంతులు, సంతోషాలతో జీవించడం కోసం అమ్మవారికి ప్రతీయేటా శాంకబరీ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు వైదిక కమిటీ తెలిపింది.
Also Read : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై ఆ ప్రచారంలో నిజం లేదు- టీటీడీ