ఆంధ్రప్రదేశ్‌లోని ఆశా వర్కర్లకు ప్రభుత్వం తీపి కబురు.. 3 కీలక నిర్ణయాలు
మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇస్తారు.

Asha Workers
ఆంధ్రప్రదేశ్‌లోని ఆశా వర్కర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రసూతి సెలవులు
మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు
వయసు పరిమితి
ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ఠ వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయం
గ్రాట్యుటీ చెల్లింపు
సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే రూ.5,000 చెల్లింపు
గరిష్ఠంగా మొత్తం రూ.1,50,000 వరకు చెల్లింపు
కాగా, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సేవల కోసం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ, ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నారు.
గర్భిణీ స్త్రీలకు సాయం చేస్తున్నారు. పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, టీకాలు వేయించేందుకు సాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రచారం చేస్తున్నారు.