Nara Lokesh : పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది.. మంత్రి నారా లోకేష్
Nara Lokesh : ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Nara Lokesh
Nara Lokesh : దాదాపు 30ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పులివెందుల (Nara Lokesh) ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also : Movie Ticket Prices : వార్ 2, కూలీ మూవీ టికెట్ రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. అయితే, రెండు చోట్లా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నిక ముఖ్యంగా వైసీపీ, టీడీప మధ్య గట్టి పోరు జరిగింది.
పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణా రెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి పోటీపడ్డారు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.
#FreedomAfter30Years
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం… భయపెట్టి… pic.twitter.com/leziLcQ1RY— Lokesh Nara (@naralokesh) August 12, 2025