Movie Ticket Prices : వార్ 2, కూలీ మూవీ టికెట్ రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
Movie Ticket Prices : కూలీ, వార్ 2 మూవీ టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Movie Ticket Prices
Movie Ticket Prices : రాష్ట్రంలో సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేకించి వార్ 2, కూలి మూవీల టికెట్ల ధరలను (Movie Ticket Prices) పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు భారీ బడ్జెట్ మూవీలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వార్ 2 మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. వార్ 2 మూవీ రిలీజ్ రోజున ఉదయం 5 గంటల షోకు అనుమతినిచ్చింది. అయితే ఈ మూవీ టికెట్ ధర రూ. 500గా నిర్ణయించింది.
కూలీ మూవీ టికెట్ల ధరల పెంపు :
అయితే, మూవీ రిలీజ్ నుంచి 10 రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 చొప్పున టికెట్ల ధరలను పెంచుకోవచ్చు. మరోవైపు.. రజనీకాంత్ నటించిన కూలి సినిమా టికెట్ రేట్లను ఏపీ ప్రభుత్వం పెంచేసింది.
ప్రత్యేకించి అదనపు షోలకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14 నుంచి 23 వరకు కూలి సినిమా టికెట్ల పెంపుకు అనుమతినిచ్చింది. ప్రధానంగా సింగల్ స్క్రీన్ థియేటర్లో రూ. 75, మల్టీప్లెక్స్‌లో రూ. 100 అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 14వ తేదీ ఉదయం బెనిఫిట్ షోకి కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్ 2 మూవీకి కూడా కూలి మూవీ తరహా ధరలు, నిబంధనలు అమల్లో ఉంటాయి.