Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఈ నగరాల్లోని స్టేషన్లలో ఫ్రీ Wi-Fi సర్వీసులు.. ఇలా యాక్సస్ చేయొచ్చు!

Indian Railways : రైల్వే ప్యాసెంజర్లు ఇకపై హైదరాబాద్ సహా పలు నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఉచితంగా వై-ఫై సర్వీసులను పొందవచ్చు. అది ఎలాగంటే?

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఈ నగరాల్లోని స్టేషన్లలో ఫ్రీ Wi-Fi సర్వీసులు.. ఇలా యాక్సస్ చేయొచ్చు!

Indian Railways

Updated On : August 12, 2025 / 9:10 PM IST

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచితంగా వై-ఫై సర్వీసులను పొందవచ్చు. దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు (Indian Railways) ఉచిత వై-ఫై సౌకర్యాలను అందించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వైష్ణవ్ రాజ్యసభకు వివరించారు. భారత రైల్వే అందించే దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో 4G/5G కవరేజ్ ఉంది.

ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే నెట్‌వర్క్‌లను డేటా కనెక్టివిటీ కోసం కూడా ప్రయాణికులు వినియోగిస్తున్నారు. తద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రాబోయే రైల్వే స్టేషన్లు వివరాలేంటి? ప్రయాణికులు ఎలా వై-ఫై సర్వీసును యాక్సస్ చేయొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Fixed Deposit Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. మంచి వడ్డీ రేట్లతో భారీ రాబడిని అందించే బ్యాంకులివే..!

ఫ్రీ Wi-Fi ఎలా యాక్సెస్ చేయాలి? (Indian Railways)  :

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో Wi-Fi మోడ్‌ను ఆన్ చేయండి.
  • ‘RailWire’ Wi-Fiకి కనెక్ట్ అవ్వండి.
  • SMS OTP కోసం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి Wi-Fi ఎనేబుల్ చేయండి.
  • ప్రయాణీకుల కోసం రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi ద్వారా HD వీడియోలను వీక్షించవచ్చు.
  • ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు.
  • ఆఫీసు సంబంధిత పనులను కూడా పూర్తి చేయొచ్చు.

ఏయే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi ఉందంటే? :
దేశరాజధాని (Indian Railways) న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, పూణే, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి అన్ని ప్రధాన టైర్ 1 నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఫ్రీ వై-ఫై సర్వీసు అందుబాటులో ఉంది. అలాగే, సూరత్, వడోదర, రాజ్‌కోట్, మీరట్, భోపాల్ తరహా టైర్ 2 నగరాలు, రోహ్‌తక్, కటక్ వంటి టైర్ 3 నగరాల్లోని స్టేషన్లలో సైతం వై-ఫై ఫెసిలిటీ అందుబాటులో ఉంది.

భారతీయ రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi అనేది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (PSU) RailTel పేరుతో ‘RailWire’ బ్రాండ్‌ ద్వారా అందిస్తోంది. ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం రైల్‌టెల్ గతంలో గూగుల్, టాటా ట్రస్ట్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కానీ, ఇప్పుడు పీఎస్‌యూ రైల్‌వైర్ యాక్సెస్‌ను అందిస్తోంది.