Fixed Deposit Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. మంచి వడ్డీ రేట్లతో భారీ రాబడిని అందించే బ్యాంకులివే..!
Fixed Deposit Rates : సీనియర్ సిటిజన్ల కోసం FDలపై భారీ వడ్డీ రేటుతో రాబడిని అందించే బ్యాంకుల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

FD Interest Rates
Fixed Deposit Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలి MPC సమావేశంలో రెపో రేటులో మార్పు చేయలేదు. ఈసారి ఆర్బీఐ రెపో (Fixed Deposit Rates) రేటును 5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. అయినప్పటికీ, చాలా బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను మార్చాయి.
మీరు సీనియర్ సిటిజన్ అయితే మీ డబ్బును పెట్టుబడి పెట్టేందుకు మంచి FD పథకం ఎంచుకోండి. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో భారీ వడ్డీ రేటుతో రాబడిని అందిస్తున్న బ్యాంకులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే FD వడ్డీ రేట్లను మార్చింది. కొత్త వడ్డీ రేట్లు 10 ఆగస్టు 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 ఏళ్ల కాలపరిమితి FDలో సీనియర్ సిటిజన్లకు 7.20 శాతంతో అత్యధిక వడ్డీ రేటు రాబడిని ఇస్తోంది.
బంధన్ బ్యాంక్ :
బంధన్ బ్యాంక్ FD వడ్డీ రేట్లను కూడా మార్చింది. ఆగస్టు 9 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 2 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.80 శాతం రాబడిని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) :
ఈ బ్యాంక్ 777 రోజుల స్పెషల్ స్టార్ (Fixed Deposit Rates) ఉత్సవ్ క్స్‌డ్ డిపాజిట్లపై 7.10 శాతం రాబడిని అందిస్తోంది. ఇతర కాలాలతో పోలిస్తే చాలా అత్యధికమనే చెప్పాలి.
కెనరా బ్యాంకు (Canera Bank) :
కెనరా బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ బ్యాంక్ 444 రోజుల FDపై సీనియర్ సిటిజన్లకు 7 శాతం మేర అత్యధిక వడ్డీ రేటుతో రాబడిని అందిస్తుంది.