Ram Charan : చేతులు విరగ్గొట్టుకోవడం కాదు.. రక్తం కూడా ఇస్తా.. చనిపోయేవరకు మీ కోసమే.. చరణ్ స్పీచ్ వైరల్..
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. (Ram Charan)
Ram Charan
Ram Charan : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
Also Read : Buchibabu Sana : అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు.. పడినా లేచి నిలబడిన మనిషి కథ.. బుచ్చిబాబు స్పీచ్ వైరల్..
ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు. సక్సెస్ మీట్ లా ఉంది. నాన్న గారికి ఇది లక్కీయేస్ట్ సిటీ. ఆ లక్ ని నేను కూడా ఇంటికి తీసుకెల్దామని విజయవాడ వచ్చా. ఆర్టిస్ట్ గా ఎన్నో కథలు వింటాను. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ పెద్ది కథ ఎక్కడో గుండెలో హృదయానికి చాలా దగ్గరకు హత్తుకునే కథ. నాన్న గారు చెప్పినట్టు పదేళ్లకు ఒకసారి వస్తుంది. ఈ కథ నాకు తీసుకొచ్చినందుకు సుకుమార్ గారికి ధనువాదాలు. నా సినిమా లైబ్రరీలో టాప్ సినిమా ఇది. పెద్ది నన్ను వ్యక్తిగతంగా మంచి దారిలో పెటింది, యాక్టర్ గా సంతృప్తి ఇచ్చింది. ఇది నాకు బుచ్చి ఒక సినిమా కథలాగా చెప్పలేదు. ఒక మనిషి జర్నీ లాగా చెప్పారు.
కింద పడిన మనిషి లేచి ఎలా నిలబడతారో అలాంటి కథ. అందరూ నా కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరె ఇలాంటి కథ గురించి కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం. భవిష్యత్తులో ఇండియా టాప్ నలుగురు దర్శకులలో బుచ్చిబాబు ఉంటాడు. ఇలాంటి సినిమా చేయడానికి మీరే కారణం. అభిమానుల ప్రేమ లేకపోతే సినిమాలు చేస్తామా. మీ కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడం కాదు, రక్తం చిందించి మరీ పనిచేస్తా. నాన్న గారి కొడుకుగా, కళ్యాణ్ బాబాయ్ ఉన్నందుకు మీ కోసం చేస్తా. ఇది తప్ప నాకేం తెలియదు. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను రాసిపెట్టుకోండి. నాకు తెలిసింది సినిమా సినిమా సినిమా. నాకు వెళ్లాలని లేదు ఇక్కడే ఉండాలని ఉంది ఇలా అభిమానుల మధ్య. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని మీరంతా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని దుర్గమ్మని కోరుకుంటున్నాను అని అన్నారు.
