పులివెందుల రిజల్ట్ గేమ్‌ఛేంజర్ కాబోతోందా? రిజల్ట్ అటుఇటు అయితే ఎవరికి కష్టం? సర్వత్రా ఉత్కంఠ
ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని..సర్వశక్తులు ఒడ్డాక ఓడిపోతే కూటమి కూడా అంతో ఇంతో నిరాశ తప్పదు. అయితే టీడీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది.

Chandrababu-Jagan
ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. ఎంత కాదన్న ఏపీలో జనరల్ ఎలక్షన్స్ రావాలంటే ఇంకో మూడున్నరేళ్ల టైమ్ ఉంది. కానీ ఇంతలోనే వచ్చిన ఓ చిన్న ఉప ఎన్నిక ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. పులివెందుల జడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నిక నెక్స్ట్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేసింది. మామూలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ బైపోల్ అంటే ఎమ్మెల్యేలో, మంత్రో ఫోకస్ పెట్టడమే మహా ఎక్కువ. కానీ ఏకంగా అధినేత కాన్సంట్రేషన్‌లో జడ్పీటీసీ బైపోల్ జరగడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. కారణం అది పులివెందుల. అది చిన్న ఎన్నిక లేక పెద్ద ఎన్నిక అన్నది అన్నది కాదు.
ఇక కీలక నేత నియోజకవర్గం ఒక వార్డుకు ఎన్నిక జరిగినా స్టేట్ మొత్తం రీసౌండ్ చేస్తుంది. ఇపుడు అలాంటి సందర్భమే వచ్చింది. పైగా అది వైసీపీ అధినేత జగన్ కంచుకోటగా చెప్పుకునే చోటు. వైఎస్ రాజారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి..ఇప్పడు జగన్ మోహన్‌రెడ్డి ఇలా వైఎస్ ఫ్యామిలీకి అక్కడే తిరుగే లేకుండా గెలుచుకుంటూ వస్తున్నారు. లోకల్ బాడీ పోల్స్‌లో అయితే ఏకగ్రీవం లేకపోతే. అపోజిషన్ క్యాండిడేట్ బరిలో ఉన్నా నామమాత్రం పోటీనే. అలాంటిది ఈ సారి మాత్రం వైసీపీ ఓ రేంజ్ ఫైట్ ఫేస్ చేస్తోంది. అపోజిషన్‌లో ఉన్నాం..పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అధినేత సొంత ఇలాకా సీటు అది. అక్కడి గెలిచి తీరాలని తీవ్రంగా శ్రమించింది వైసీపీ. టీడీపీ అయితే ఇదే అదునుగా అధికారం, ఆర్థిక, అంగ బలంతో..ఇప్పుడే జగన్ కంచుకోటను బద్దలు కొట్టి తీరాలని సర్వశక్తులు ఒడ్డింది.
Also Read: జీతాలు భారీగా పెరగనున్నాయ్.. విశ్లేషకులు ఏమంటున్నారంటే?
పులివెందుల జడ్పీటీసీ బైఎలక్షన్‌లో ప్రతి నిమిషం సినిమాలో క్లైమాక్స్ లెవల్‌లో కొనసాగింది. ఎట్టకేలకు ఘర్షణలు, అడ్డంకులు, అరెస్టులు, ఆంక్షల మధ్య పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడు ఎన్నికల ఫలితం మీదే అందరి దృష్టి ఉంది. ఇక్కడ గెలుపు అధికార కూటమికి ఇటు వైసీపీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మధ్య వైసీపీ గ్రాఫ్ మళ్లీ పెరుగుతోందన్న చర్చ సాగుతోంది. జగన్ ఎక్కడికెళ్లినా జనాలు భారీ వస్తుండటంతో ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో హోప్స్ పెరిగాయి.
కూటమితో అమీతుమీ అన్నట్లుగా వైసీపీ పోరు
దాంతో మ్లీ తామే పవర్‌లోకి వస్తాం రాసిపెట్టుకోండని చెబుతోంది వైసీపీ అధినాయకత్వం. ఈ పరిస్థితుల్లో కూటమితో అమీతుమీ అన్నట్లుగా వైసీపీ నేతలు తలపడుతున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల ఉపఎన్నిక రావడం కూటమికి అంది వచ్చిన అవకాశం మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి జగన్ సొంత ఇలాకాలోనే ఆయనకు బలం లేదని నిరూపించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది టీడీపీ. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడమే కాదు..కుప్పం స్థానిక సంస్థల్లో అప్పటి వైసీపీ విజయానికి ఇప్పుడు రివేంజ్ తీసుకునే టైమ్‌గా భావించింది.
పులివెందుల ఫలితం అటు ఇటు అయినా ఏమవుతుంది అన్నది మరో చర్చ. వైసీపీ గెలిస్తే వారి సిట్టింగ్ సీటును గెలుచుకున్నట్లు అవుతోంది. పైగా జగన్ కంచుకోటలో జగన్ పట్టు నిలుపుకున్నట్లు అవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. జగన్ సొంత ఇలాకాలో ఒక జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయారని టీడీపీ ఏపీ అంతటా ప్రచారం చేయొచ్చు. పులివెందులను కూడా గెలిచామని ఇక 2029లో జగన్‌ను మళ్లీ ఓడిస్తామని కూటమి బలంగా ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఓడిపోయిన వాళ్లకు ఎఫెక్ట్ తప్పదు.
ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని..సర్వశక్తులు ఒడ్డాక ఓడిపోతే కూటమి కూడా అంతో ఇంతో నిరాశ తప్పదు. అయితే టీడీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. కానీ 2024 ఎన్నికల నాటికి అంతకు మూడింతలు భారీ మెజారిటీతో చంద్రబాబు కుప్పం నుంచి ఎనిమిదోసారి గెలిచి సత్తా చాటారు. ఉప ఎన్నికలకు..జనరల్ ఎలక్షన్స్‌కు ఎప్పుడూ పొంతన ఉండదు. అయితే గెలుపు ఎప్పుడూ గెలుపే కాబట్టి..ఓడిపోతే వైసీపీని కొన్నాళ్ల పాటు ఈ ఫలితం డీమోరలైజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఒక వేళ వైసీపీయే గెలిచినట్లు అయితే తమ బలం తమకు ఉందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ బైపోల్ ఫలితం తీవ్రం ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నెల 14న ఫలితాలు ఎలా రాబోతున్నాయో చూడాలి మరి.