Pawan Kalyan : గ్యాప్ లేకుండా మళ్ళీ పవన్ వారాహి మొదలు.. మరి షూటింగ్స్ ఎప్పుడు?

ఫస్ట ఫేజ్ వారాహి యాత్ర కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ సెకండ్ వీక్ నుంచి షూట్ లో జాయిన్ అవుతారని, ఉస్తాద్, ఓజీ సినిమాల్లో దేనికి షూటింగ్ కి వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ మొత్తానికే సీన్ రివర్స్ అయ్యింది.

Pawan Kalyan Movie Shootings Delayed due to Varahi Yatra

Pawan Kalyan  :  పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు సెట్లోకి వస్తారా? ఎప్పుడు కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేస్తారా అని వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు అంతా. ఓ పక్క అభిమానులు, మరో పాక్ అదిరెక్టర్స్, నిర్మాతలు. షూటింగ్స్ స్టార్ట్ చేశారుకదా అని షెడ్యూల్స్ వేసుకుని సార్ సెట్లోకి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తుంటే ఫస్ట్ ఫేజ్ పొలిటికల్ టూర్ వారాహి యాత్ర స్టార్ట్ చేశారు. 15 రోజుల పాటు యాత్ర కంప్లీట్ అయ్యాక టూర్ కి బ్రేక్ ఇచ్చి షూట్ లో జాయిన్ అవుతారని అనుకున్నారు అంతా.

ఫస్ట ఫేజ్ వారాహి యాత్ర కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ సెకండ్ వీక్ నుంచి షూట్ లో జాయిన్ అవుతారని, ఉస్తాద్, ఓజీ సినిమాల్లో దేనికి షూటింగ్ కి వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ మొత్తానికే సీన్ రివర్స్ అయ్యింది. నేడు జులై 9 నుంచి పవన్ పొలిటికల్ యాత్రం రెండో ఫేజ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రజెంట్ మూడు సినిమాలున్నా అర్జెంటుగా కంప్లీట్ చెయ్యాల్సినవి మాత్రం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.

ఆల్రెడీ ఓజీ 50 పర్సెంట్ కంప్లీట్ అయినా ఇందులో పవన్ కళ్యాణ్ 2 వారాలు షూట్ చేశారు. దీనికి సంబందించి ఇంకా 3 వారాలు షూట్స్ చెయ్యాల్సి ఉందని సమాచారం. కానీ సెకండ్ ఫేజ్ యాత్ర స్టార్ట్ చెయ్యడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్టే. డిసెంబర్ ఎండ్ కి రిలీజ్ అనుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కూడా లేట్ అయ్యే చాన్సుంది.

Raviteja : మాసివ్ కాంబో బ్యాక్.. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్.. క్రాక్ 2..?

ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు పడుతున్న డైరెక్టర్ హరీశ్ శంకర్. పవన్ కళ్యాణ్, హరీశ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అసలే లేట్ గా స్టార్ట్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ తో ఓ 10 రోజులు షూట్ చేసింది టీమ్. ఇంకా దాదాపు 90 పర్సెంట్ షూట్ మిగిలే ఉంది. ఫస్ట్ ఫేజ్ యాత్ర కంప్లీట్ అయ్యాక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ షూట్ లో జాయిన్ అవుతారనుకున్నారు అంతా. అందుకే గ్రాండ్ గా సెట్లేసుకుని, షూట్ స్టార్ట్ చేస్తున్నామంటూ పోస్టులు కూడా పెట్టింది టీమ్. కానీ సీన్ రివర్స్ అయ్యింది. షూట్ లో జాయిన్ అవ్వడం కాదు కదా మరో రౌండ్ పొలిటికల్ టూర్ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇలా పవన్ కళ్యాణ్ సెట్లోకి వస్తారా, షూటింగ్ చేస్తారా..? తెలీక, వస్తారని వెయిట్ చేస్తూ సినిమా యూనిట్స్ మాత్రం కన్‌ప్యూజ్ అవుతున్నాయి. మరి పవన్ అనుకున్న ప్రకారం ఈ ఇయర్ ఎండ్ కి కనీసం రెండు సినిమాలన్నా షూట్ పూర్తి చేస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు