Raviteja : మాసివ్ కాంబో బ్యాక్.. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్.. క్రాక్ 2..?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండబోతుందని నేడు అధికారికంగా ప్రకటించారు.

Raviteja Gopichand Malineni Combo again under Mythri Movie Makers

Raviteja Gopichand Malineni :  గోపీచంద్ మలినేని – రవితేజ అంటే సూపర్ హిట్ కాంబో. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2021లో వచ్చిన క్రాక్ సినిమా గోపీచంద్ అండ్ రవితేజ కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఆ సినిమాకి ముందు ఇద్దరు ప్లాప్ లతో సతమతం అవుతున్నారు. దీంతో క్రాక్ సినిమా వీరిద్దరి కెరీర్ లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. అప్పట్నుంచి క్రాక్ కి సీక్వెల్ వస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

డైరెక్టర్ గోపీచంద్ కూడా గతంలో క్రాక్ 2 సినిమా ఉంటుందని ప్రకటించాడు. దీంతో మాస్ మహారాజ అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా క్రాక్ 2 కోసం చూస్తున్నారు. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో సినిమాని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండబోతుందని నేడు అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Mahaveerudu Pre Release Event : మహావీరుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ కాంబోలో ఇది నాలుగో సినిమా. అయితే ఇది క్రాక్ 2 నా? కాదా అనేది ప్రకటించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది క్రాక్ 2 అనే భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ అనౌన్స్ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా పవర్ ఫుల్ మాస్ స్టోరీ, చుండూరు బ్యాక్ డ్రాప్ లో జరగబోతుందని తెలుస్తుంది. వీళ్ళ హ్యాట్రిక్ ని కంటిన్యూ చేస్తూ సెకండ్ హ్యాట్రిక్ మొదలుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు