Thangalaan release date : రామ్‌తో పోటీకి సై అంటున్న చియాన్ విక్ర‌మ్‌.. ‘తంగ‌లాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ న‌టిస్తున్న మూవీ తంగ‌లాన్‌.

Chiyaan Vikram Thangalaan release date fix

Thangalaan : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆయ‌న ప్రేక్షకులను అలరిస్తుంటారు. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ న‌టిస్తున్న మూవీ తంగ‌లాన్‌. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లకు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 15న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌తో కూడిన వీడియోను విడుద‌ల చేసింది.

Ram Charan : గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం..

ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐదు భాష‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. ఆగ‌స్టు 15న టాలీవుడ్‌లో డ‌బుల్ ఇస్మార్ట్, బాలీవుడ్‌లో స్త్రీ 2 మూవీలు విడుద‌ల కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూడు సినిమాలు ఏ మేర‌కు స‌త్తా చాటుతాయో చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు