Sajjala Ramakrishna Reddy : వైసీపీ ఓటమి నిర్ణయించేది పవన్ కల్యాణ్ కాదు, ఆ ఇద్దరూ ఒక్కటే- సజ్జల రామకృష్ణారెడ్డి

విశాఖలో క్రైమ్ పెరిగిందంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వారు ఎన్ని కుట్రలు చేసినా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం..Sajjala Ramakrishna Reddy - Pawan Kalyan

Sajjala Ramakrishna Reddy - Pawan Kalyan (Photo : Google)

Sajjala Ramakrishna Reddy – Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఓటమి నిర్ణయించేంది పవన్ కల్యాణ్ కాదన్నారు సజ్జల. చంద్రబాబు ఎలా చెప్తే అలా పవన్ పోటీ చేస్తారని అన్నారు. ముందు నుండి ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలు కొత్తేమీ కాదన్నారు. చంద్రబాబు దగ్గర బేరం పెంచుకోడానికి పవన్ ఒక్కోసారి అటు.. ఇటు మాట్లాడతాడు అని సజ్జల అన్నారు. చంద్రబాబు నిలబడలేక పవన్ ను పెట్టుకున్నాడు అని చెప్పారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విజన్ ఏమైంది..? అని సజ్జల ప్రశ్నించారు.

గన్నవరం వైసీపీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీని వీడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తడిగుడ్డతో నా గొంతు కోశారు, ఎన్నో అవమానాలకు గురి చేశారు అంటూ వైసీపీ అధిష్టానంపై వెంకట్రావ్ సంచలన ఆరోపణలు చేశారు. వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాకే యార్లగడ్డ వెంకట్రావ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

Also Read..Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..

పార్టీ కోసం పని చేయాలని, అవకాశం కోసం ఎదురు చూడాలని సజ్జల సూచించారు. ఎవరినీ అవమానించడం, బాధించడం అనేది ఉండదన్నారు. ఏ పార్టీలోనైనా ఇలాంటివి సహజం అన్నారు. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఏ పార్టీలోనైనా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలనే కోరుకుంటామని, సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడాలే తప్ప.. వేదికలపై ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అని సజ్జల హితవు పలికారు.

అదే సమయంలో చంద్రబాబు, పవన్ పై విరుచుకుపడ్డారు సజ్జల. ”సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్‌ చెబుతూ వస్తున్నాడు. దీనికోసం పవన్‌ ఎవరితోనైనా కలుస్తాడు. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తాడు. పవన్‌, చంద్రబాబు ఎప్పుడూ కలిసే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయి. చంద్రబాబుకు ఆర్కెస్ట్రా లాగా పవన్ వ్యవహరిస్తున్నాడు. విశాఖలో క్రైమ్ పెరిగిందంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వారు ఎన్ని కుట్రలు చేసినా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది’ అని సజ్జల తేల్చి చెప్పారు.

Also Read..Botsa Family : చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి.. ఎంపీగా పోటీ చేస్తారా?

ట్రెండింగ్ వార్తలు