Badvel : బద్వేల్ లో విద్యుత్ ఉద్యోగులు నిరసన.. విద్యుత్ లేక అలుముకున్న చీకట్లు, ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు

పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.

Badvel Power Cut (2)

Badvel Power Cut : కడప జిల్లాలో బద్వేల్ లో విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో ఉన్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. బద్వేల్ పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. బద్వేలులో గాలివానకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లేక పట్ణణమంతా అంధకారం అయింది.

దీనిపై విద్యుత్ శాఖ ఉద్యోగులను అడగ్గా తాము ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామని విద్యుత్ శాఖ జేఏసీ ఉద్యోగులు చెబుతున్నారు. తాము ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులకు సైతం తమ విధులు నిర్వహణపై వినతి పత్రం ఇచ్చామని ఉద్యోగులు అంటున్నారు.

Amanchi Krishna Mohan : పోలీసులతో చంద్రబాబు కేసులు పెట్టించారు.. అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నా

సాయంత్రం 5 గంటల తర్వాత ఏమి జరిగినా తమకు సంబంధం లేదని విద్యుత్ శాఖ ఉద్యోగులు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన ఈపీఎఫ్, జీపీఎఫ్, పే రివిజన్ వంటి అంశాలను పరిష్కరించే వరకు ఈ ఉద్యమం చేస్తామని ఏపీ జేఏసీ ఉద్యోగులు చెబుతున్నారు.

తమ డిమాండ్స్ పరిష్కరించకుంటే ఆగిస్టు 8వ తేదీ నుంచి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. కాగా, సాయంత్రం వచ్చిన గాలివానకు బద్వేల్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

Jennifer Larson: టీటీడీలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ స్పందన

పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి. ప్రభుత్వ, ప్రవేట్ హాస్పిటల్స్ లో విద్యుత్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు