Maoists Booby Traps : మావోయిస్టుల బూబీ ట్రాప్ లను నిర్వీర్యం చేసిన పోలీసులు

ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకోసం వచ్చే పోలీసులు మరియు భద్రత బలగాలే లక్ష్యంగా “బూబీ ట్రాప్” లను అమర్చారు మావోయిస్టులు.

Maoists Booby Traps : పోలీసులు భద్రతా దళాలపై దాడికి మావోయిస్టులు సరికొత్త వ్యూహలను అమలు పరుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకోసం వచ్చే పోలీసులు మరియు భద్రత బలగాలే లక్ష్యంగా “బూబీ ట్రాప్” లను అమర్చారు మావోయిస్టులు. ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఉన్న మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో నిన్న రోజు వారీ తనిఖీలలో భాగంగా యాంటీ నక్సల్ స్క్వాడ్ మరియు సిఆర్పిఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా వీటిని గుర్తించారు.

Also Read : Dowry Harassment : పెళ్లైన 10 ఏళ్లకు కూడా వరకట్న వేధింపులు ..వివాహిత ఆత్మహత్య

భద్రతా దళాలు మావోయిస్టులు అమర్చిన 10 బూబి ట్రాప్ లను ధ్వంసం చేశారు. భూమిలో లో పది అడుగుల లోతు వరకు కందకాలను త్రవ్వి… దానిలో వెదురు బొంగుల ను బాణాల మాదిరిగా సూది మొనలవలె చెక్కి, భూమిలో గుచ్చి, వాటిపై భాగాన ఆకులు అలముల తో కప్పబడి ఉండేవే బూబీ ట్రాప్ లు. కూంబింగ్ కు వచ్చే భద్రత బలగాలు వాటిపై కాలు వేసిన వెంటనే 10 అడుగుల లోతులోని బూబీ ట్రాప్ లో పడిపోతారు. అందులో అమర్చిన వెదురు బాణాలు శరీరంలో గుచ్చుకుని తీవ్ర గాయాల పాలయ్యేలా చేయటం మావోయిస్టుల వ్యూహం.

10 బూబీ ట్రాప్ లను గుర్తించి వాటిలో అమర్చిన వెదురు బాణాలను భధ్రతా దళాలు బయటకు తీసి వేశాయి. మావోయిస్టులు వ్యూహాత్మక యుద్ధ తంత్రంలో భాగంగా భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి వాటిలో చిక్కుకుని పోలీస్ బలగాలకు అపార నష్టం కలిగించే విధంగా చత్తీస్ గఢ్ లోని గుత్తికోయలు ఈ బూబీ ట్రూప్ లను ఏర్పాట చేస్తారని పోలీసులు తెలిపారు. పోలీసులు వీటిని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పిందని తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాధ్ బాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు