Rare Coral Reefs In Ap Coastal : ఉత్తరాంధ్ర తీరంలో అరుదైన పగడపు దిబ్బలు గుర్తించిన పరిశోధకులు

సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ.. దాని అందం తెలుస్తుంది అంటారు. పగడపు దిబ్బలు.. సాగరానికి మరింత శోభ తీసుకువస్తాయ్. ఐతే అలాంటి వాటినే ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించారు. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల పగడపు దిబ్బలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

rare coral reefs found In Andra pradesh Coastal Area : సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ.. దాని అందం తెలుస్తుంది అంటారు. పగడపు దిబ్బలు.. సాగరానికి మరింత శోభ తీసుకువస్తాయ్. ఐతే అలాంటి వాటినే ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించారు. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల పగడపు దిబ్బలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వాటికి మాత్రమే ఒకరకమైన ప్రత్యేకత సొంతం అంటున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ.. ఏమున్నాయ్ అందులో !

సముద్రగర్భంలో అందమైన ప్రపంచం దాగి ఉంటుంది. లక్షలాది జీవిరాశులతో పాటు అబ్బురపరిచే మొక్కలు, పగడపు దిబ్బలు ఉంటాయ్. భూమ్మీద ఎక్కడా కనిపించని అత్యంత అందంగా ఉంటుంది సాగర గర్భం. ఇవన్నీ సినిమాల్లోనో… లేక విదేశాల్లోని సముద్ర గర్భాల్లోనో కనిపిస్తుంటాయ్. అది నిన్నటివరకు.. ఏపీలోనూ అలాంటివి ఉన్నాయ్. జువలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయ్. ఆ రిపోర్టులో తెలిపిన విషయాలు.. ఉత్తరాంధ్ర సముద్ర తీరం మీద మరింత ఆసక్తి పెంచుతున్నాయ్. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అసలు ఉండవ్ అనే మాట తప్పు అని.. ఆ రిపోర్టు నిరూపిస్తోంది.

Also read : Rare Coral Reefs In Ap Coastal : ఏపీలోని పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బల ప్రత్యేకత ఏంటి ?

అనకపల్లి జిల్లా పూడిమడక నుంచి… విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతం అంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని గుర్తించారు. భారతీయ పగడాల వర్గీకరణపై ZSI నిరంతర పరిశోధనలు చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రా తీరంలో మొదటిసారిగా 2020లో సర్వే మొదలుపెట్టింది. జనవరి 17 నుంచి 26 వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయ్. అదే ఇప్పుడు ఉత్తరాంధ్ర సముద్ర తీరానికి ప్రత్యేక తీసుకువస్తోంది.

పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్‌నగర్, ఆర్‌కే బీచ్, మంగమూరి పేట, తెన్నేటి పార్క్‌, చింతపల్లి బీచ్‌లో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆ ఏరియాల్లో 30మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబా డైవింగ్‌ సంస్థ లివిన్‌ అడ్వెంచర్స్‌ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో… పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు గుర్తించారు.

ముఖ్యంగా డిస్కోసోమా, లోబాక్టిస్, హెక్సకోరిలియా, ఆక్టోటోరిలియా, పపోనా ఎస్పీ, స్కెలరాక్టినియా కోరల్స్, లిథోపిలాన్‌ ఎస్‌పీ, మోంటీపోరా ఎస్‌పీ, పోరిటెస్‌ ఎస్‌పీ వంటి కోరల్స్ ఈ సముద్ర గర్భంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అరుదైన జాతులు పూడిమడకలో ఉన్నాయని పరిశోధకులు కనిపెట్టారు. ప్రస్తుతం గుర్తించిన పగడపు దిబ్బలు.. మెడిసిన్స్ తయారీలో ఉపయోగపడుతాయని పరిశోధకులు చెప్తున్నారు.

పగడపు దిబ్బల జాడ తెలుసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని ఏళ్లుగా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ఇదే పని మీద నిమగ్నం అయింది. నిజానికి ఇలాంటి పరిశోధనలు మొదలుపెట్టినప్పుడు ఉత్తరాంధ్ర తీరంలో కోరల్ లీఫ్స్ లభించడం కష్టం అనుకున్నారు. ఐతే రోజూ చూస్తున్న సముద్రం గర్భంలో.. ఇంత అందం ఉందా అని పగడపు దిబ్బల విషయం తెలుసుకొని జనం ఆశ్చర్యపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు