Trains Canceled : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

South Central Railway : ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెల్లూరు-పడుగపాడు మార్గంలో 18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లను దారి మళ్లించారు. ఒక రైలు వేళల్లో మార్పు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు..
20895 రామేశ్వరం- భువనేశ్వర్‌, 22859 పూరి- చెన్నె సెంట్రల్‌, 17489 పూరి- తిరుపతి, 12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌, 12967 చెన్నై సెంట్రల్‌- జైపూర్‌, 06426 నాగర్‌సోల్‌- తిరువనంతపురం, 06427 తిరువనంతపురం- నాగర్‌సోల్‌, 06425 కొల్లాం- తిరువనంతపురం, 06435 తిరువనంతపురం- నాగర్‌సోల్‌, 12863 హౌరా- యశ్వంతపూర్‌, 12269 చెన్నై సెంట్రల్‌- హజరత్‌ నిజముద్దీన్‌, 12842 చెన్నై సెంట్రల్‌- హౌరా, 12656 చెన్నై సెంట్రల్‌- అహ్మదాబాద్‌, 12712 చెన్నై సెంట్రల్‌- విజయవాడ, 12510 గువహటి- బెంగళూరు కంటోన్మెంట్‌, 15930 న్యూ తినుసుకియా – తాంబరం, 20890 తిరుపతి- హౌరా, 12798 చిత్తూరు- కాచిగూడ
17487 కడప- విశాఖపట్నం, 17651 చెంగల్‌పట్టు – కాచిగూడ రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Corona : బాలికల గురుకుల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా

దారి మళ్లించిన రైళ్ల వివరాలు..
12642 హజరత్‌ నిజాముద్దీన్‌- కన్యాకుమారి, 12616 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌, 22877 హౌరా- ఎర్నాకుళం, 12845 భువనేశ్వర్‌- బెంగళూరు కంటోన్మెంట్‌, 22502 న్యూ తిన్‌సుకియా- బెంగళూరు, 12270 హజరత్‌ నిజాముద్దీన్‌- చెన్నై సెంట్రల్‌, 12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌ రైలు, 12622 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌ రైలు, 12296 దానపూర్‌- బెంగళూరు, 12968 జైపూర్‌- చెన్నై సెంట్రల్‌ రైలును దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్ల వివరాలు…
13351 ధన్‌బాద్‌- అలెప్పీ రైలు సుమారు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
15906 డిబ్రూగఢ్‌ –  కన్యాకుమారి రైలు న్యూ జల్‌పాయిగుడి – కన్యకుమారి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు. 12708 హజరత్‌నిజాముద్దీన్‌- తిరుపతి రైలు బిట్రగుంట- తిరుపతి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్రెండింగ్ వార్తలు