Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ సూపర్ ప్లాన్!

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీని ఓడించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారు.

Srikakulam Loksabha Seat

Srikakulam Loksabha Seat: సిక్కోలు పార్లమెంట్‌ సీట్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ హవాను బ్రేక్ చేసి టీడీపీ (TDP) విజయం సాధించిన మూడు సీట్లలో ఒకటి సిక్కోలు (Sikkolu). అంతేకాదు కింజరాపు కుటుంబాని (Kinjarapu Family)కి కంచుకోటగా మారిన శ్రీకాకుళంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా (YCP Flag) ఎగరేయాలని చూస్తున్నారు సీఎం జగన్ (CM Jagan). గత రెండు ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేలా అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారు.. సామాజిక వర్గాల వారీగా లెక్కలు తీస్తూ.. కింజరాపు కోటను బద్దలు కొట్టే నేత కోసం జల్లెడ పడుతున్నారట సీఎం జగన్.

సిక్కోలు సింహాసనంపై నుంచి టీడీపీని దించేయాలని అధికార వైసీపీ భారీ ప్లానే వేస్తోంది. 1996 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా మరెప్పుడూ ఓడిపోని టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలని స్కెచ్ వేస్తున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సునామీ సృష్టించిన జగన్.. సిక్కోలులో మాత్రం ఎదురుదెబ్బ తిన్నారు. 25 ఎంపీ సీట్లలో 22 గెలిస్తే.. గెలవని.. గెలవలేని నియోజకవర్గంగా సిక్కోలు మిగిలిపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు జగన్. అంతేకాదు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu), ఆయన అన్న కుమారుడు ఎంపీ రామ్మోహన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

సిక్కోలు నుంచి ఎంపీ రామ్మోహన్ (Ram Mohan Naidu Kinjarapu) రెండుసార్లు గెలిచారు. 2014లో తొలిసారి ఆయన ఎంపీగా గెలిచినప్పుడు.. తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి పనిచేసిందని అంతా లెక్కలు వేసుకున్నారు. యువకుడు కావడంతో కలిసొచ్చిందని భావించారు. కానీ, 2019లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఐదు చోట్ల వైసీపీ గెలిచినా ఎంపీ సీటు గెలవలేకపోయింది. ఇక అప్పటి నుంచి ఈ స్థానంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది వైసీపీ. 2014లో కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతిని.. 2019లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) ను పోటీకి పెట్టి విఫలమైంది వైసీపీ. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా మూడు సామాజిక వర్గాలు ఉంటే రెండు సామాజికవర్గాల నేతలకు చాన్స్ ఇచ్చినా గెలుపు రుచి చూడలేకపోయింది. ఈ లెక్క ఈ సారి మిగిలిన ప్రధాన సామాజిక వర్గం వెలమలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం జగన్.

Also Read: కొడాలి నానికి ప్రత్యర్థిని వెతకడమే పెద్ద సవాల్.. గుడివాడ టీడీపీ అభ్యర్థి ఎవరంటే!

సిక్కోలు ఎంపీ సీటుకు ప్రస్తుతం వైసీపీ ఇన్‌చార్జి ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తన సొంత నియోజవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో జిల్లావ్యాప్తంగా ప్రభావితం చేసే నేతల కోసం వెతుకుతోంది వైసీపీ అధిష్టానం. స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram), మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasad Rao), మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు.. దుట్టా, యార్లగడ్డ, వంశీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమా?

ముఖ్యంగా ధర్మాన సోదరులు వెలమ సామాజిక వర్గ నేతలు కావడం.. ఆ సామాజిక వర్గ ఓట్లు క్రాస్ ఓటింగ్ వల్లే రామ్మోహన్‌నాయుడు గెలుస్తున్నట్లు భావిస్తున్నందున.. ధర్మాన సోదరుల్లో ఎవరో ఒకరిని బరిలోకి దింపితే క్రాస్ ఓటింగ్‌కు చెక్ చెప్పొచ్చని వైసీపీ విశ్లేషణ. ఐతే ధర్మాన సోదరులు పోటీకి ససేమిరా అంటే స్పీకర్ తమ్మినేని సీతారాం లేదంటే కళింగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ధానేటి శ్రీధర్‌ల్లో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమేనా సరే వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్‌నాయుడికి చెక్ చెప్పడమే వైసీపీ ప్రధాన టార్గెట్‌గా ఎంపీ అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు