Chandrababu Naidu: ‘క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం చేపట్టాలి’ : చంద్రబాబు

ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది అని..క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం చేపట్టాలి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, తుని కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu : ‘ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణలేకుండాపోతోంది..క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం చేపట్టాలి’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, తుని కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమైన సందర్భంగా ఈ పిలుపునిచ్చారు. ఏపీలో జరుగుతున్న రాక్షస పాలనను అడ్డుకోవాలని దీని కోసం ప్రజా ఉద్యమం రావాలి ఆ ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది అంటూచంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసవరమైతే రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం అంటూపిలుపునిచ్చారు. ఆ పన్ను ఈ పన్ను అంటూ ప్రజలను ప్రభుత్వం ఎన్నో విధాలుగా పీడిస్తోందని సామాన్య ప్రజలు ప్రభుత్వం బాదుడికి తాళలేకపోతున్నారని అన్నారు.

Also read : AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

ఇటువంటి పరిస్థితులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరు ఏకంగా కావాల్సిన అవసరం ఉందని అని అన్న చంద్రబాబు నాకు వ్యక్తిగతంగా ఎవ్వరిపై కోసం లేదని అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అంటే కనీసం 10వ తరగతి పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారంటూ విమర్శించారు. పేపర్ లీక్స్ అవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఎదురు దాడికి దిగుతోంది అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది అని..హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రాన్ని తగుల బెడుతున్నారంటూ తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు చంద్రబాబు. అత్యాచారాలు సాధారణమే అంటూ సాక్షాత్తు హోమంత్రి అనటం అత్యంత సిగ్గుచేటు అంటూ దుయ్యబట్టారు చంద్రబాబు.

Also read : Chandrababu : యువతను ఆకర్షించేందుకు..టీడీపీ కసరత్తు..చంద్రబాబు ప్లాన్ ఏంటీ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని అన్నిరంగాల్లో ప్రజలపై ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెట్టుకుందని అన్నారు.. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగాలేదంటూ..మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. బాబాయిని చంపిన వ్యక్తులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని మండిపడ్డారు. జగన్‌ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని… ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ నేతలకు..కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ట్రెండింగ్ వార్తలు