Chandrababu Naidu : ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి…ప్రజలను మెప్పించి గెలవాలి

ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.

AP Local Election : ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి…ప్రజలను మెప్పించి గెలవాలన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని…దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బలవంతపు చర్యలతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుని అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని తెలిపారు. గతంలో స్థానిక ఎన్నికల్లోనూ…ఇలాగే అరాచకాలకు పాల్పడి రాజకీయ లబ్ది పొందారని, తాము నామినేషన్ పత్రాలతో కూడిన సెట్ లను కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో పాటు హైకోర్టుకు పంపడం జరిగిందన్నారు బాబు.

Read More : Hyderabad Crime : ఆటోలో మహిళపై అత్యాచారయత్నం

కుప్పంలో అస్సలు గొడవలు లేవని…కానీ రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల మున్సిపాల్టీల్లో తప్పుడు డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే…SEC ఏం చేస్తోందని, ఎన్నికల యంత్రాంగం వారి ఆధీనంలో ఉందా అంటూ ప్రశ్నించారు.

Read More : Covid 19 Death : కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ. 50 వేలు..దరఖాస్తుల స్వీకరణ

ప్రజలు తిరగబడితే…వైసీపీ నాయకులను తరిమికొడుతారని, ఇప్పటికే ఆ తిరుగుబాటు మొదలైందన్నారు. నెల్లూరులో రాత్రి వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించలేదని, తమ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసి 8 వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. జంగమహేశ్వరపురంలో ప్రతిపక్షాలకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని…ఏన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు