TDP MP Kanakamedala: రాజ్యసభలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ ఎంపీ కనకమేడల

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం రాజ్యసభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను లెవనెత్తారు.

TDP MP Kanakamedala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలసత్యం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం రాజ్యసభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను లెవనెత్తారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం చెడగొట్టిందని, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకపోగా పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చిన వారు కూడా పక్క రాష్ట్రాలకి తరలిపోయారంటూ ఎంపీ కనకమేడల మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతో చివరకి సినిమా టిక్కెట్ల వ్యవహారంలోనూ తలదూర్చిందని తీవ్రంగా విమర్శించారు.

Also read: Karnataka Hijab Row: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినీలను తరగతిలోకి అనుమతించిన కళాశాల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నా కనకమేడల.. రాష్ట్రం డ్రగ్స్ హబ్ గా మారిందని రాజ్యసభ సాక్షిగా ఆందోళన వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నారని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడులు చేశారంటూ రవీంద్ర కుమార్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. రవీంద్ర కుమార్ మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్.. రవీంద్ర కుమార్ ప్రసంగాన్ని అడ్డుకోవద్దని విజయసారిరెడ్డిని వారించారు.

Also read: Gadwal Bidda: సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన “గద్వాల్ రెడ్డి బిడ్డ” అనారోగ్యంతో మృతి

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఏపీ రాజధానిగా ఒప్పుకుని.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులకు తెరలేపారని.. ఇప్పుడు అసలు రాజధాని ఎక్కడో తేల్చకుండానే.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని జగన్ పై రవీంద్రకుమార్ విమర్శలు గుప్పించారు. గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని కూడా రవీంద్ర కుమార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Also read: vuyyuru Crime: ఉయ్యూరులో అందరూ చూస్తుండగానే వ్యక్తి పై హత్యాయత్నం

ట్రెండింగ్ వార్తలు