జగ్గయ్యపేటలో డయేరియాతో ఆరుగురి మృతి.. అప్రమత్తమైన అధికారులు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట నియోజకవర్గంలో డయేరియాతో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. వాంతులు విరేచనాలతో మరో 21 మంది ఆస్పత్రుల్లో చేరారు.

Diarrhea Cases Jaggaiyapet : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట నియోజకవర్గంలో డయేరియాతో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. వాంతులు విరేచనాలతో మరో 21 మంది ఆస్పత్రుల్లో చేరారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. షేర్ మహమ్మద్ పేట, మక్కపేట, చిట్యాల, మంగొళ్లు, బుధవాడ, అనుమంచుపల్లి గ్రామాల్లో డయేరియా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి.

Also Read : ప్రాణాలమీదకు తెచ్చిన సబ్బుబిళ్ల.. టెర్రస్ పైనుంచి జారిపడిన మహిళ.. వీడియో వైరల్

జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. గ్రామాల్లోని వీధుల వెంట బ్లీచింగ్ చల్లుతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని వాటర్ ట్యాంకులను క్లీన్ చేయిస్తున్నారు. డ్రైనేజీలో వాటర్ పైపులు ఏమైనా లీకులవుతున్నాయా అనే విషయంపైనా అధికారులు పరిశీలన చేస్తున్నారు.

Also Read : రూ.325 కోట్లతో పనులు… డిసెంబరులోపు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 

ట్రెండింగ్ వార్తలు