ప్రాణాలమీదకు తెచ్చిన సబ్బుబిళ్ల.. టెర్రస్ పైనుంచి జారిపడిన మహిళ.. వీడియో వైరల్

సుబ్బు ముక్క మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. కాపాడేందుకు భర్త విశ్వప్రయత్నాలు చేసినా టెర్రస్ పైనుంచి జారిపడింది. తీవ్ర గాయాలు కావటంతో ..

ప్రాణాలమీదకు తెచ్చిన సబ్బుబిళ్ల.. టెర్రస్ పైనుంచి జారిపడిన మహిళ.. వీడియో వైరల్

bengaluru woman steps on soap falls from terrace

Updated On : June 24, 2024 / 7:27 AM IST

Bengaluru Woman Steps on Soap : సుబ్బు ముక్క మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. కాపాడేందుకు భర్త విశ్వప్రయత్నాలు చేసినా టెర్రస్ పైనుంచి జారిపడింది. తీవ్ర గాయాలు కావటంతో ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. మహిళ టెర్రస్ పై నుంచి పడుతున్న దృశ్యాలను స్థానికులు తమ ఫోనుల్లో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, టెర్రస్ పైనుంచి కిందపడుతున్న మహిళను కాపాడేందుకు రహదారిపై ఉన్నవారు ప్రయత్నించారు. అయినా ఉపయోగం లేకపోవటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : అమెరికాలో దారుణం.. తెలుగు యువకుడు దుర్మరణం

బెంగళూరులోని కనకనగర్ డీజేహల్లి ఠాణా పరిధిలో ఓ రెండు అంతస్తుల భవనంలో మహిళ కుటుంబం జీవనం సాగిస్తుంది. ప్రమాదానికి ముందు మహిళ తన భర్తతో కలిసి రెండో అంతస్తుపైన డాబాపైకి ఎక్కింది. డాబాపై భర్తతో కలిసి తిరుగుతుండగా అనుకోకుండా ఓ సబ్బు ముక్కపై కాలు వేసింది. కాలుజారి భవనంపై నుంచి పడబోయింది. టెర్రస్ కంటెగోడను పట్టుకొని ఆగింది. వెంటనే అప్రమత్తమైన భర్త ఆమె కిందపడిపోకుండా గట్టిగా చేయిని పట్టుకొని లాగే ప్రయత్నం చేశాడు.

Also Read : AUS vs AFG: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం

భర్త చేయి పట్టుకోవడంతో పైన వేలాడుతున్న మహిళను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. పెద్ద వస్త్రాన్ని వలలా పట్టుకొని మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. మరికొందరు ఆమెను రక్షించేందుకు భవనంపైకి పరుగుపెట్టారు. ఈలోపు భర్త పట్టు సడలడంతో మహిళ కిందపడిపోయింది. ఆమెను రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మహిళకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ భవనం పైనుంచి పడుతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లలో రికార్డుచేశారు.. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.