డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు

టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రిని నిర్మాతలు కోరనున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సోమవారం మధ్యాహ్నం టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరుగుతుంది.

టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రిని నిర్మాతలు కోరనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వారు ఉప ముఖ్యమంత్రిని కలుస్తుండడం ఇదే తొలిసారి. సినిమా టిక్కెట్ల ధరలతో పాటు థియేటర్ల సమస్యలు వంటివి పవన్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

పవన్ ను అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబుతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య కలవనున్నారు.

అమరావతి, పోలవరంపై బాబు ప్రత్యేక నజర్.. శాఖలపై పట్టు సాధించేందుకు పవన్ ఫోకస్

ట్రెండింగ్ వార్తలు