Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది.. 154 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకొని..

తాజాగా పవన్ కళ్యాణ్ ని ఏపీ అసెంబ్లీ లో పనిచేసే మహిళా హౌస్ కీపింగ్ సిబ్బంది కలిశారు.

Pawan Kalyan : ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తుంది. సీఎం చంద్రబాబు ఓ పక్క అమరావతి, పోలవరం పనులు మొదలుపెట్టిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనాల సమస్యలు తీర్చడానికి పనిచేస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన దగ్గర్నుంచి ఎంతోమంది ప్రజలు పవన్ కళ్యాణ్ కి తమ సమస్యలు చెప్పుకోడానికి వస్తున్నారు. నిన్న రోడ్డు మీదే కుర్చీ వేసుకొని పవన్ ప్రజల సమస్యలు విని, వారి దగ్గర నుంచి అర్జీలు తీసుకొని, కొన్నిటికి అక్కడే ఫోన్స్ లో మాట్లాడి పని చేయమని అధికారులకు ఆదేశించారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ని ఏపీ అసెంబ్లీ లో పనిచేసే మహిళా హౌస్ కీపింగ్ సిబ్బంది కలిశారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే వచ్చిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తిరుగుతూ అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చారు. ఈ క్రమంలో శాసనసభ హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలను చెప్పుకొన్నారు.

Also Read : AP IAS Officers : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు..

పవన్ కళ్యాణ్ తో హౌస్ కీపింగ్ సిబ్బంది మాట్లాడుతూ.. 154 మంది మహిళలు హౌస్ కీపింగ్ పని చేస్తున్నాము. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాము. మేము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. 8 ఏళ్ళ కిందట 6 వేలకు ఉద్యోగంలో చేరామని, ఇప్పుడు 10 వేలు ఇస్తున్నారని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని, అయితే అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు 2500 భత్యం వచ్చేదని తరవాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని ఆ భత్యం ఆపేశారని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను పవన్ విని సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు