Sangam Auto Accident : సంగం ఆటో ప్రమాదం.. వాగులో గల్లంతైన ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు

నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది.

Sangam Auto Accident : నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ఉన్నారు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, ఆరుగురిని పోలీసులు, స్థానికులు కాపాడారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఆత్మకూరు నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని కాపాడారు.

రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాగులోంచి స్థానికులు కాపాడిన వారిలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలిక మృతి చెందింది. బాధితులంతా ఆత్మకూరు జ్యోతి నగర్ వాసులు.

గల్లంతైన వారిలో సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, ఆదెమ్మ, పద్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. వాగులో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బోట్ల రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు