Tirumala Visit: కోవిడ్ వాక్సినేషన్/నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే తిరుమల కొండపైకి అనుమతి

ప‌లువురు భ‌క్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు.

Tirumala Visit: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ కానీ తీసుకురావాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ ఈ సూచన చేసినప్పటికీ.. భక్తుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని పాక్షిక వెసులుబాటు కల్పించింది. అయితే ఇటీవల ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. భక్తులకు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది.

Also read: Open Classrooms: బహిరంగ తరగతి గదులు సిద్ధం చేస్తున్న బెంగాల్ ప్రభుత్వం

ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ “ఒమిక్రాన్” దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రతాపం చూపిస్తుందని హెచ్చరికలు జారీచేసాయి. ఈ నేప‌థ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేయించిన ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్ట్ ను వెంట తీసుకురావాలని టీటీడీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు త‌మ‌ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరారు.

Also read: Kangana Ranuat : సౌత్ స్టార్లపై కంగనా కామెంట్స్.. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు..

ప‌లువురు భ‌క్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. దీనివ‌ల‌న మిగతా భ‌క్తులు ఇబ్బందికి గురవుతున్నారు. వాక్సినేషన్ లేదా నెగటివ్ సర్టిఫికెట్లను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌ కొండపైకి అనుమ‌తిస్తారని టీటీడీ అధికారులు స్పష్టం చేసారు.

Also read: Stock Market: భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్

ట్రెండింగ్ వార్తలు