Pattabhi Arrest Incident : పట్టాభి అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించని పోలీసు అధికారులపై వేటు

టీడీపీ నేత పట్టాభి రామ్ అరెస్ట్‌ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించని పోలీసు అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేశారు.

two police officers transferred : టీడీపీ నేత పట్టాభి రామ్ అరెస్ట్‌ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించని పోలీసు అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేశారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏపీసీ రమేష్‌, సీఐ నాగరాజును బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పట్టాభి అరెస్ట్ సమయంలో..ఖాళీలతో నోటీసు ఇచ్చినందుకు పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఖాళీ నోటీసు ఇవ్వడంపై మెజిస్ట్రేట్ అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పట్టాబి అరెస్ట్ సమయంలో ఇచ్చిన నోటీసుల్లో నిబంధనలు పాటించలేదని చర్యలు తీసుకున్నారు. విజయవాడ సీటీ టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా ఉన్న రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలంటూ ఆదేశాలిచ్చారు. సీఐ నాగరాజును ఏలూరు రేంజ్‌ డీఐజీకి రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Badwel : బద్వేల్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

ఈనెల 20న పట్టాభి రామ్ ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంటి దగ్గరే పట్టాభిని అరెస్టు చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిని అరెస్ట్ చేసేందుకు రాత్రి 9 గంటల టైంలో పోలీసులు ఆయన ఇంటికి వద్దకు వెళ్లారు. ఆ టైంలో పట్టాభి తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉన్నారు. పట్టాభి బయటకు రావాలని మైక్ లో పోలీసులు కోరారు. కానీ ఆయన బయటికి రాలేదు. దీంతో పోలీసులు తలుపులు పగల గొట్టి ఇంట్లోకి వెళ్లారు. అనంతరం పట్టాభిని అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు