Citroen C3 Aircross SUV : కొత్త కారు కొంటున్నారా? సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ కారు వచ్చేసింది.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

Citroen C3 Aircross SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV భారత మార్కెట్లో సిట్రోయెన్ నాల్గవ మోడల్.. ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభమైంది. ఇప్పుడు బుకింగ్‌లు మొదలయ్యాయి.

Citroen C3 Aircross SUV launched in India at Rs 9.99 lakh

Citroen C3 Aircross SUV : ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో C3 ఎయిర్‌క్రాస్ SUV కారును రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. రూ. 25వేల టోకెన్ మొత్తానికి కారు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త మోడల్ కారు డెలివరీలు అక్టోబర్ 15న ప్రారంభమవుతాయి. C5 ఎయిర్‌క్రాస్ SUV కారు C3 హ్యాచ్‌బ్యాక్, E-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ తర్వాత C3 ఎయిర్‌క్రాస్ SUV భారత మార్కెట్లో సిట్రోయెన్ నాల్గవ మోడల్‌గా వచ్చింది.

90శాతం స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన C3 ఎయిర్‌క్రాస్ SUV తమిళనాడులోని సిట్రోయెన్ తిరువళ్లూరు ప్లాంట్‌లో తయారైంది. Citroen C3 Aircross SUV కారు మోడల్ యూ, ప్లస్, మాక్స్ అనే 3 వేరియంట్‌లలో అందిస్తోంది. ఎంట్రీ-లెవల్ యు వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇతర 2 వేరియంట్ల ధరలను కార్‌మేకర్ ఇంకా ప్రకటించలేదు.

Read Also : Tata Nexon Facelift : కారు కొంటున్నారా? టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, EV మోడల్ వచ్చేసిందోచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

ప్రీ-లాంచ్ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే? :
C3 ఎయిర్‌క్రాస్ SUV 5-సీటర్ లేఅవుట్ 5+2-సీటర్ లేఅవుట్‌లో అందుబాటులో ఉంది. మూడో వరుస సీట్లను తొలగించవచ్చు. U వేరియంట్ 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. మిగిలిన 2 వేరియంట్‌లు ఆఫర్‌లో 2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 2023లో C3 ఎయిర్‌క్రాస్ SUV లాంచ్ అయినప్పటి నుంచి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే, C3 Aircross SUV ప్రీ-లాంచ్ బుకింగ్స్ ప్రారంభం కాగా రూ. 9.99 లక్షల (షోరూమ్)కు సొంతం చేసుకోవచ్చు.

హై లోకలైజేషన్‌తో భారత్‌లో టాప్ రేంజ్ ఆఫర్‌లను అందిస్తుందని స్టెల్లంటిస్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ బౌచార అన్నారు. C3 ఎయిర్‌క్రాస్ SUV డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మల్టీఫేస్ సైన్ కోరుకునే భారతీయ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించామని అన్నారాయన.

Citroen C3 Aircross SUV launched in India at Rs 9.99 lakh

C3 ఎయిర్‌క్రాస్ SUV హుడ్ కింద కంపెనీ 1.2-లీటర్ Gen-3 Turbo PureTech పెట్రోల్ ఇంజన్ అందిస్తుంది. గరిష్టంగా 110PS శక్తిని, 190Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ప్రస్తుతానికి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదని చెప్పవచ్చు.

ARAI- వెరిఫైడ్ చేసిన C3 ఎయిర్‌క్రాస్ మైలేజ్ 18.5kmpl అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. వాహనంలో LED DRLలతో కూడిన హాలోజన్ రిఫ్లెక్టర్ హెడ్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, డ్యూయల్-టోన్ రూఫ్ ఆప్షన్ ఉన్నాయి.

క్యాబిన్ లోపల 10.23-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను పొందవచ్చు. రూఫ్-మౌంటెడ్ AC వెంట్లు కూడా ఉన్నాయి. కానీ, 5+2-సీటర్ లేఅవుట్ వేరియంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే డిస్కౌంట్లు.. ఆన్‌లైన్‌లో ప్రీ-బుకింగ్ చేసుకోవాలంటే? ఇదిగో ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు