Chinese Apps : నిషేధాన్ని ధిక్కరిస్తూ.. ఇండియాలో గుట్టుగా పెరిగిపోతున్న చైనా యాప్స్!

చైనా యాప్‌లను ఇండియా నిషేధించింది. అయినప్పటికీ డ్రాగన్ చైనా తన బుద్ధిని మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ గుట్టుగా చైనా యాప్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Defying ban Chinese Apps Grow in India : చైనా యాప్‌లను ఇండియా నిషేధించింది. అయినప్పటికీ డ్రాగన్ చైనా తన బుద్ధిని మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ గుట్టుగా చైనా యాప్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాత పేర్లకు బదులుగా కొత్త కంపెనీల పేర్లతో యాప్స్ రన్ చేస్తున్నాయట.. చైనా యాప్స్ దేశీయ సార్వభౌమత్వం, సమగ్రత భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడటంతో భారత ప్రభుత్వం డ్రాగన్ యాప్స్ అన్నింటిని బ్యాన్ చేసేసింది. అయినప్పటికీ దేశంలో చైనాకు సంబంధించిన కొన్ని యాప్‌లు పెరిగిపోతున్నాయి. అలీబాబా, బైటెన్స్ షియోమి వంటి వాటి కొన్ని కంపెనీలను నిషేధించినా.. వీటిలో చాలా కంపెనీలు తమ చైనీస్ మూలాలను దాచేందుకు ప్రయత్నించాయి. కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్‌లను లిస్ట్ చేస్తున్నాయి. యాప్‌ ఓనర్ షిప్ పబ్లిక్ డేటా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు భారతదేశంలో టాప్ 60 యాప్‌లలో కనీసం 8 యాప్‌లు చైనా ఆపరేట్‌గా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి నెలా 211 మిలియన్లకు పైగా యూజర్లను చేరుకోవాలనేది వీటి లక్ష్యమని ఓ నివేదిక వెల్లడించింది. జూలై 2020లో చైనీస్ యాప్‌లు నిషేధించిన తర్వాత అదే యాప్‌లు 96 మిలియన్ యూజర్లను కలిగి ఉన్నాయి. గత 13 నెలల్లో 115 మిలియన్ కొత్త యూజర్లు చేరినట్టు తెలుస్తోంది.
Read More : పబ్​జీ సహా 118 చైనా యాప్స్ బ్యాన్​ చేసిన కేంద్రం

ఎన్నడూ లేనంతగా గత ఏడాదిలో ఇండియాలో 267 చైనీస్ యాప్‌లపై ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. భారత్, చైనాల మధ్య సరిహద్దు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో 2020లో భారత ప్రభుత్వం TiTok, UC Browser, PUBG, Helo, AliExpress, Likee, Shareit, Mi Community, WeChat CamScanner, Baidu Search, Weibo,Bigo Live యాప్‌లపై నిషేధం విధించింది. చైనాకు సంబంధించిన కొన్ని యాప్‌లు, డేటా భద్రత సహా పౌరుల భద్రత దృష్ట్యా నిషేధం విధించినట్టు హోం మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందని ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ ఈ యాప్‌ల యాక్సెస్‌ను నిషేధించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త ముసుగులో యాప్ లిస్టింగ్ :
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా… పౌరుల ప్రయోజనాలను సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం తెలిపింది. కానీ, ఈ చైనా యాప్స్ మళ్లీ కొత్త ముసుగులో ప్రవేశించడాన్ని గుర్తించలేదు. ఈ యాప్ కంపెనీలకు దేశంలో బలం పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ చైనీస్ మూలాలను దాచడానికి ప్రయత్నించాయి. కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్‌లను లిస్టు చేశాయి. దాదాపు అన్ని కొత్త యాప్‌లు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌కు చెందినవే ఉన్నాయి. అందులో టిక్‌టాక్ (Bytedance), స్నాక్ వీడియో (Kuaishou) కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలపై 2020లో నిషేధం విధించినప్పటికీ.. ఇంకా దేశంలో గుట్టుగా పనిచేస్తూనే ఉన్నాయి. చైనా కంపెనీలు ఈ కేటగిరి కంపెనీల యాప్స్ లక్ష్యంగా చేసుకున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు.
Read More : పబ్​జీ సహా 118 చైనా యాప్స్ బ్యాన్​ చేసిన కేంద్రం

నిషేధం తర్వాత చాలా యాప్స్.. తొందరగా పెద్ద సంఖ్యలో యూజర్లను చేరుకునేందుకు ఇలాంటి యాప్స్ ఆపరేట్ చేస్తున్నాయని గుర్తించారు. కొన్ని యాప్‌లు కేవలం నెలల్లోనే పదిలక్షల మంది యూజర్లను చేరుకున్నాయి. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనీస్ యాప్ PLAYit. ఈ యాప్ పైరసీని ప్రోత్సహించడం ద్వారా త్వరగా పాపులర్ అయింది. ఈ యాప్ ద్వారా వీడియోలను ప్లే చేయడమే కాదు.. Netflix, MXPlayer, SonyLiv వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల్లోని మూవీలు, షోల పైరేటెడ్ కాపీలను టెలిగ్రామ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇలా డౌన్ లోడ్ చేసిన మూవీలను PLAYit యాప్‌లో ప్లే చేసే వీలుంది.

ట్రెండింగ్ వార్తలు