Home Construction : ఇలా చేస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు..!

ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు ఉంటే సరిపోదు అంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకి వెళ్తానే అనుకున్న టైమ్ లో అనుకున్న బడ్జెట్ లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు. Home Construction Cost

Home Construction Cost

Home Construction Cost : ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. మరి ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇంటి నిర్మాణానికి కావాల్సిన ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. అయితే, ఆర్కిటెక్ట్ తో ఇంటి ప్లాన్ ని గీయించుకుని పక్కా ప్రణాళికతో కడితే ఇంటి నిర్మాణ వ్యయాన్ని కొంత తగ్గించుకోవచ్చు అంటున్నారు రియల్ రంగ నిపుణులు.

సొంతిల్లు ప్రటి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా వారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. తమ కలల ఇంటి కోసం పైసాపైసా కూడబెడుతూ ఉంటారు. అయితే, ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు ఉంటే సరిపోదు అంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకి వెళ్తానే అనుకున్న టైమ్ లో అనుకున్న బడ్జెట్ లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు.

Also Read..5 Best Laptop Deals : ఫ్లిప్‌కార్ట్‌లో 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్.. 37శాతం డిస్కౌంట్.. ఏ ల్యాప్‌టాప్ తక్కువ ధర ఉందంటే?

ఇల్లు కట్టుకునే క్రమంలో ప్రధానమైనది ఇంటి ప్లాన్. సొంతంగా డ్రాయింగ్స్ గీయడమ, మేస్త్రీ మీదనే పూర్తిగా వదిలిపెట్టడం చేయకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ను అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ తో గీయించాలని సూచిస్తున్నారు. చాలామంది ఇంజినీర్ కు ఫీజు దండగ అని చెప్పి సొంత ప్రయోగాలు చేయడమో, రెడీమేడ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడమో చేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంజినీర్ ను సంప్రదిస్తే మీ స్థలాన్ని పరిశీలించి మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్ ఇస్తారు. అంతేకాకుండా స్ట్రక్చరల్ డిజైన్స్ తీసుకోవడం వల్ల పునాదులు, కాలమ్స్, బీమ్స్ ఎక్కడెక్కవ వస్తాయి? ఎంత స్టీల్ కావాలి? సిమెంట్, ఇసుక, ఇటుకల అవసరం ఎంత ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది.

కాలమ్, బీమ్స్, శ్లాబ్, గోడలు కట్టిన తర్వాత కూడా చాలామంది మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. శ్లాబ్స్ కొంత భాగం తొలగించడం, కట్టిన గోడలు పగలగొట్టి మళ్లీ కట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇంజినీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టాలని మేస్త్రీకి స్పష్టంగా చెప్పాలి. సామగ్రి వృథాను సాధ్యమైనంత వరకు తగ్గేలా చూసుకోవాలి.

Also Read..Royal Enfiled Bullet 350 : డుగ్ డుగ్ బండి వచ్చేస్తోంది.. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

సిమెంట్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు 10 నుంచి 12శాతం వృథా అవుతుంది. ఇది 8శాతం మించకుండా ఉండాలని అందుకోసం కిందపడిన సిమెంట్ ను కొన్ని చోట్ల వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టైల్స్ వృథా సైతం 2శాతం లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్లాబ్ పనులు, ఫ్లోరింగ్ లో కాంక్రీట్ ను వృథా చేయకుండా లింటెడ్ సన్ షేడ్ వంటి వాటిలో వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు