Honda Elevate Launch : హోండా ఎలివేట్ కారు వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌లోనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Honda Elevate Launch : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి వాటికి పోటీగా హోండా ఎలివేట్ కారు వచ్చేస్తోంది.

Honda Elevate launch in India in first week of September

Honda Elevate Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) సెప్టెంబర్ మొదటి వారంలో హోండా ఎలివేట్‌ను లాంచ్ చేయనుంది. కొత్త మిడ్-సైజ్ SUV జూన్ 6న ప్రపంచవ్యాప్త అరంగేట్రం చేయగా.. జూలై 3న బుకింగ్‌లను ప్రారంభించింది. హోండా ఎలివేట్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి వాటికి పోటీగా మార్కెట్లోకి రానుంది.

Read Also : JioBook Laptop : రూ. 16,499కే కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్.. అద్భుతమైన ఫీచర్లు.. కొంటే ఇలాంటి ల్యాప్‌టాప్ కొనాలి.. సేల్ ఎప్పటినుంచంటే?

హోండా ఎలివేట్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. 2030 నాటికి భారత్‌లో 5 SUVలను లాంచ్ చేయాలని హోండా ప్లాన్ చేసింది. అందులో హోండా ఎలివేట్ మొదటిది. ఎలివేట్ ఆధారంగా EV కారు 3 ఏళ్లలో ప్రవేశపెడుతుంది. హోండా ఎలివేట్ గ్లోబల్ మోడల్ అయితే, ఈ SUVని లాంచ్ చేస్తున్న ఫస్ట్ దేశం భారత్ మాత్రమే.. థాయ్‌లాండ్‌లోని హోండా ఆర్ అండ్ డి ఆసియా పసిఫిక్‌లో డెవలప్ అయింది.

Honda Elevate launch in India in first week of September

ఎలివేట్‌కు పవర్ ఇచ్చే 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్ 121PS, 145Nm ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVT ఆటోమేటిక్‌తో పెయిర్ చేయొచ్చు. క్లెయిమ్ చేసిన ఎలివేట్ మైలేజ్ MT వెర్షన్ 15.31kmpl, CVT వెర్షన్ ధర 16.92kmpl దూసుకెళ్లగలవు. ఫీచర్ల విషయానికొస్తే.. SUV LED DRLలు, LED టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఫుల్-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది.

క్యాబిన్‌కు 7-అంగుళాల HD కలర్ TFT MID, 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. హోండా సెన్సింగ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సూట్ కూడా ఉంది. ఎలివేట్ 4,312mm పొడవు, 1,790mm వెడల్పు, 1,650mm పొడవు కలిగి ఉంది. ఆకట్టుకునే 220mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. వీల్‌బేస్ పొడవు 2,650 మి.మీ అందిస్తుంది.

Read Also : ITR filing Last Day Today : మీరు ఐటీఆర్ దాఖలు చేశారా? ఆన్‌లైన్‌లో ITR రీఫండ్ స్టేటస్ చెక్ చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు