Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
- Harishth Thanniru
- Published On : July 17, 2024 / 12:02 PM IST
Gold
Gold and Silver Price Today : బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన డిమాండ్, దేశీయంగా నగల వర్తకుల నుంచి ఊపందుకున్న కొనుగోళ్లు పసిడి విలువను పైపైకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 980 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 900 పెరిగింది. అదేవిధంగా వెండి ధరసైతం భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజు కిలో వెండిపై వెయ్యి పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. లక్ష దాటేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.75,000. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,900 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 75,150.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,750 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 75,000.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,200 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,490కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 1,00,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,00,500.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 96,000 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.96,000.
బెంగళూరులో కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 94,750 వద్దకు చేరింది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
