ITR filing Last Day Today : మీరు ఐటీఆర్ దాఖలు చేశారా? ఆన్‌లైన్‌లో ITR రీఫండ్ స్టేటస్ చెక్ చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ITR filing Last Day Today : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి జూలై 31 లాస్ట్ డేట్.. ఎలాంటి పెనాల్టీలు పడకుండా ఉండాలంటే వెంటనే దాఖలు చేసుకోండి. ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ITR filing Last Day Today _ How to check your Income Tax Return refund status online

ITR filing Last Day Today : ఐటీఆర్ దాఖలుకు కొన్ని గంటలే సమయం ఉంది. ఈరోజే లాస్ట్ డేట్ (జూలై 31).. చివరి తేదీ కావడంతో పన్నుచెల్లింపుదారులు ఎక్కువ సంఖ్యలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. సోమవారం (ఈరోజు) దాటితే ఐటీఆర్ ఫైలింగ్‌పై పెనాల్టీ చెల్లించక తప్పదు. అందుకే ట్యాక్స్ పేయర్లు చాలామంది వెబ్‌సైట్లో లాగిన్ అయి ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్ నెమ్మదించింది. దాంతో చాలామంది పన్నుచెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకూ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (Income-tax Returns) ఎంతమంది దాఖలు చేశారన్న విషయంపై ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. మొత్తంగా 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల ఐటీఆర్ దాఖలయ్యాయి.

ఇక ఆదివారం విషయానికి వస్తే.. 26.76 లక్షల ఐటీఆర్ దాఖలయ్యాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆదివారం 1.30 కోట్ల మంది లాగిన్ కాగా.. సోమవారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది లాగిన్ అయ్యారని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేయలేమా? అంటే చేసేందుకు వీలుంది. కానీ, పెనాల్టీతో ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది.

పెనాల్టీ పడకుండా ఉండాలంటే గడువు తేదీలోగా మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు విషయంలో ఏదైనా సాయం కావాలన్నా తమ పోర్టల్ ద్వారా ఏ సమయంలోనైనా చాట్ చేయొచ్చని, లేదంటే కాల్స్ చేయవచ్చని ఐటీ శాఖ పేర్కొంది.

Read Also : ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెంటనే చేసేయండి. లేదంటే జరిగే నష్టం ఇదే..

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) గడువు తేదీలోగా ఫైల్ చేశారా? లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. లేదంటే జరిమానాలు తప్పవు. ఒకవేళ మీరు ముందుగానే ఐటీఆర్ దాఖలు చేసి ఉంటే.. ఆన్‌లైన్‌లో ఈజీగా రీఫండ్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్‌ల స్టేటస్ ట్రాక్ చేయడంలో సాయపడేందుకు ITR రీఫండ్ స్టేటస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో స్పెషల్ సెక్షన్ కలిగి ఉంది.

ITR filing Last Day Today _ How to check your Income Tax Return refund status online

పన్ను చెల్లింపుదారులు ITR, ఇ-వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత తమ బ్యాంక్ అకౌంట్లలో రీఫండ్ (అర్హత ఉంటే) అందుకుంటారని అని ప్రభుత్వ సంస్థ పేర్కొంది. ఐటీఆర్ స్టేటస్ చెక్ చేయడానికి వినియోగదారుకు కావలసిందల్లా.. వారి పాన్ నంబర్ (PAN Number), అసెస్‌మెంట్ ఇయర్ మాత్రమేనని గమనించాలి. ఆదాయపు పన్ను శాఖ ఆన్‌లైన్ ట్రాకింగ్ సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో ITR రీఫండ్ స్టేటస్ చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ITR రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే? :
* ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (incometax.gov.in/iec/foportal)ని విజిట్ చేయండి.
* వెబ్‌సైట్‌లోని క్విక్ లింక్స్ (Quick Links) సెక్షన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) స్టేటస్ లింక్‌పై క్లిక్ చేయండి.
* ‘Check Refund Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
* కొత్త పేజీలో, మీ పాన్ నెంబర్ (PAN) ఎంటర్ చేయండి.
* మీ ITR ఫైల్ చేసిన అసెస్‌మెంట్ ఇయర్ (AY)ని ఎంచుకోండి. ఈ రెండు వివరాలను మీ ఆదాయపు పన్ను రిటర్న్ రసీదులో చూడవచ్చు.
* ధృవీకరణ ప్రయోజనాల కోసం స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా (Captcha) కోడ్‌ను ఎంటర్ చేయండి.
* చివరగా, మీ ITR రీఫండ్ స్టేటస్ చూసేందుకు ‘Submit’ లేదా ‘Check Status‘ బటన్‌పై క్లిక్ చేయండి.

ఆదాయపు పన్ను శాఖ రీఫండ్‌ని నేరుగా మీ నిర్దేశిత బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేయడం ద్వారా లేదా ‘Refund Cheque’ జారీ చేయడం ద్వారా జారీ చేస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్లో రీఫండ్‌ని స్వీకరించాలని ఎంచుకుంటే.. మీ PIN కోడ్‌తో సహా పూర్తి అడ్రస్ వివరాలతో పాటు సరైన బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్‌ను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, మీ పన్నులను దాఖలు చేసిన కొన్ని రోజుల తర్వాత మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) రీఫండ్ స్టేటస్ చెక్ చేయడం తప్పనిసరి.. సాధారణంగా, రీఫండ్ ప్రాసెస్.. మీ రిటర్న్ ఇ-వెరిఫికేషన్ తర్వాత మీ అకౌంట్లో డిపాజిట్ కావడానికి 7 రోజుల నుంచి 120 రోజుల మధ్య సమయం పట్టవచ్చు. అయితే, ప్రాసెస్ వేగంగా ఉంటుంది. ఇ-వెరిఫికేషన్ జరిగిన 2 రోజులలోపు రీఫండ్‌లు త్వరగా పూర్తి అవుతాయి.

మీరు మీ రీఫండ్‌ను సకాలంలో అందుకున్నారని నిర్ధారించుకోవడానికి.. ఫైల్ చేసిన వెంటనే మీ ITRని ఇ-వెరిఫై చేయాలని నిర్ధారించుకోండి. మీ రిటర్న్ సంక్లిష్టత, పన్ను శాఖలో ప్రాసెసింగ్ లోడ్ వంటి వివిధ అంశాల ఆధారంగా రీఫండ్ క్రెడిట్ చేయడానికి కచ్చితమైన వ్యవధి మారవచ్చని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, మీ కాంటాక్టు, బ్యాంక్ అకౌంట్ వివరాలు లేటెస్ట్ అప్‌డేట్ అయి కచ్చితమైనవిగా ఉండాలి. తద్వారా IT రిటర్న్‌తో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఐటీ శాఖ వెబ్‌సైట్లో మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి.

Read Also : ITR: తుది గడువు.. చివరిరోజు ఎన్ని లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేశారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు