ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెంటనే చేసేయండి. లేదంటే జరిగే నష్టం ఇదే..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతోందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటే.. సబ్ సెక్షన్-1లో నిర్దేశించిన సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలి

ITR Filing July 31: ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ఒక ముఖ్యమైన సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 31తో ముగిస్తుంది. వాస్తవానికి ఇది ఏ సంవత్సరమైనా మే 31తోనే ముగుస్తుంది. కానీ ఈ యేడాది జూలై 31 వరకు అవకాశం ఇచ్చారు. అయితే మీరు ఇప్పటి వరకు పన్ను ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే వీలైనంత తొందరలో వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఇలా చేయడం చేయడం వల్ల ముందు జరిగే నష్టాలను నివారించవచ్చు. ఒకవేళ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే జరిగే నష్టాల గురించి తెలసుకోండి.

HYD – Vijayawada Highway Closed : హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు బంద్

ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జూలై 23, 2023 వరకు 4 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. అలాగే ఆదాయపన్ను శాఖ ఇప్పటి వరకు 80 లక్షల మందికి రీఫండ్‌లు జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. కాగా, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్ రిటర్న్ లాస్ట్ డేట్) దాఖలు చేసే చివరి తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఐటీఆర్ ను సకాలంలో ఫైల్ చేయకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

Airtel Jio 5G Services : దేశంలో 8వేలకు పైగా నగరాల్లో ఎయిర్‌టెల్, జియో 5G సర్వీసులు.. 5G యాక్టివేట్ చేసుకోవడం ఎలా? ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతోందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటే.. సబ్ సెక్షన్-1లో నిర్దేశించిన సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలి. లేదంటే ఆలస్య రుసుము చెల్లించాలి. డిసెంబర్ 31లోపు చెల్లించినట్లైతే 5 వేల రూపాయల పెనాల్టీ, ఆ తర్వాత చెల్లిస్తే 10 వేల రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లించడం వల్ల నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

Conjunctivitis Scare : వేగంగా వ్యాప్తి చెందుతున్న కండ్లకలక.. ప్రయాణసమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

ఈ నష్టాలు రెండు రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. మొదటిది.. ఐటీ చట్టం ప్రకారం, ఏదైనా ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారునికి నిర్ధిష్ట హెడ్ కిందకి వచ్చే మూలం నుంచి నష్టం వచ్చినట్లైతే ఆ వ్యక్తి హెడ్ కిందకు వచ్చే ఇతర మూలాల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ నష్టాన్ని సర్దుభాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఇక రెండవది.. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుడు ఒక ఆదాయ హెడ్ కింద నష్టాన్ని మరొక హెడ్ కింద ఆదాయాన్ని పొందినట్లైతే ఆ వ్యక్తి ఒక హెడ్ కింద వచ్చిన నష్టాన్ని మరొక హెడ్ కిందకి వచ్చే లాభంతో సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది.

High Court : తెలంగాణలో భారీ వర్షాలపై హైకోర్టులో పిల్.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు

అయితే, ఆదాయపు పన్ను శాఖ నియమం ప్రకారం జూలై 31 తర్వాత కూడా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కొందరు ఉన్నారు. అంటే ఈ నియమం ప్రకారం జూలై 31 తర్వాత కూడా ITR ఫైల్ చేసినందుకు ఎటువంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం రెండున్నర లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ అయితే పైన పేర్కొన్న నియమం ప్రకారం జూలై 31 తర్వాత కూడా మీ రిటర్న్‌ను ఫైల్ చేయగలరు మరియు జరిమానా విధించబడరు.

ట్రెండింగ్ వార్తలు