Honor 90 Launch : హానర్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తోంది.. 200MP కెమెరాతో హానర్ 90 కొత్త ఫోన్ లాంచ్ ఎప్పుడంటే?

Honor 90 Launch : హానర్ మళ్లీ భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తోంది. మాజీ (Realme CEO) మాధవ్ షేత్ నేతృత్వంలో హానర్ సెప్టెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే అదే విధమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది.

Honor to return to India with a 200-megapixel camera phone, launch expected in September

Honor 90 Launch : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (Honor) త్వరలో భారత మార్కెట్లో రీఎంట్రీ ఇవ్వనుంది. నివేదిక ప్రకారం.. రాబోయే నెలల్లో హానర్ 90 ఫోన్ (Honor 90) భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ హానర్ ఫోన్ ఇప్పటికే కొన్ని ఇతర దేశాలలో లాంచ్ అయింది. పుకార్ల ప్రకారం.. రియల్‌మి మాజీ CEO మాధవ్ షేత్ భారత్‌లో హానర్‌కు నాయకత్వం వహించడానికి రెడీగా ఉన్నారు. 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు రియల్‌మి విడిచిపెట్టి ఇప్పటికే (HonorTech)లో చేరారని IANS నివేదిక తెలిపింది.

హానర్ 90 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
హానర్ ఫోన్ కచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.. హానర్ 90 సెప్టెంబర్‌లో భారతీయ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కచ్చితమైన ధర ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు.

Read Also :  Infinix GT Pro Launch : రూ. 20వేల లోపు ధరలో గేమింగ్ కంట్రోల్‌తో ఇన్ఫినిక్స్ GT ప్రో ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు (అంచనా) :
హానర్ 90 ఫోన్ ఇప్పటికే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ఆధారంగా భారతీయ వేరియంట్‌లో ఇలాంటి స్పెసిఫికేషన్‌లు ఉంటాయని తెలుస్తోంది. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 4 విభిన్న కలర్ ఆప్షన్లలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఎమరాల్డ్ గ్రీన్ వేరియంట్ భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

హానర్ రిటర్న్ టు ఇండియా :
రియల్‌మి ఇండియా మాజీ సీఈఓ మాధవ్ షేత్ నేతృత్వంలో హానర్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రీఎంట్రీ ఇచ్చే నివేదికలు ఉన్నాయి. హానర్‌తో తన అనుబంధాన్ని సీఈఓ షెత్ అధికారికంగా ధృవీకరించలేదు. షేత్ పేరు ప్రస్తావించిన ’హానర్ ఫర్ నైట్స్’ అనే ట్రేడ్‌మార్క్ గుర్తించింది. ట్రేడ్‌మార్క్ ప్రొడక్టు వివరణలో మొబైల్ ఫోన్లు, అప్లియన్సెస్ ఉన్నాయి.

Honor to return to India with a 200-megapixel camera phone, launch expected in September

గత హానర్ సవాళ్లు :
కొన్ని ఏళ్ల క్రితమే.. ఆ సమయంలో Huawei సబ్-బ్రాండ్‌గా పాపులర్ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, అమెరికా ప్రభుత్వం గూగుల్ సర్వీసులను ఉపయోగించకుండా (Huawei)ని కంట్రోల్ చేసేందుకు సవాళ్లను ఎదుర్కొంది. హానర్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను విడిచిపెట్టవచ్చని సూచించే నివేదికలు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత కంపెనీ ఆ వాదనలను తీవ్రంగా ఖండించింది. ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ, హానర్ భారత్‌లో కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది.

Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లపై దృష్టి సారించింది. Honor 9A భారత మార్కెట్లో హానర్ లాంచ్ చేసిన చివరి స్మార్ట్‌ఫోన్ కాగా, ఈ ఫోన్ ధర రూ. 10వేల కన్నా లో బడ్జెట్-ఫ్రెండ్లీ డివైజ్ అని చెప్పవచ్చు. హానర్ భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న తరుణంలో హానర్ 90 ఫోన్ ఏయే ఆఫర్లతో వస్తుందోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ ఫోన్ ఫీచర్లు, ధర గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.

Read Also : WhatsApp Hacking Scam : వాట్సాప్ హ్యాకింగ్ స్కామ్‌తో జాగ్రత్త.. స్కామర్ల నుంచి మీ అకౌంట్లు ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు