Goat Cultivation Tips : వర్షాకాలంలో జీవాల పోషణ.. నివారణకు ముందస్తు జాగ్రత్తలు, పశువైద్యుల సూచనలు

Goat Cultivation Tips : పాడిపరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ అనుబంధరంగం జీవాల పెంపకం. ఒకప్పుడు కుల వృత్తిగా ఉన్నా, ప్రస్తుతం వాణిజ్య సరళిలో చాలామంది జీవనోపాధి కోసం గొర్రెలు, మేకల ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు.

Goat Cultivation And Tips

Goat Cultivation Tips : వర్షాకాలంలో సాధారణంగా వ్యాధులు విజృంభిస్తుంటాయి. వర్షాలతో వాతావరణంలో కలిగే మార్పులు మనుషులతోపాటు జీవాలకు హాని కలిగిస్తాయి. చిరుజల్లులకు అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరుగుతాయి. కొత్త చిగుళ్లనే అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడిచేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ మూడు నెలలు జీవాల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్  డీన్  వెంకట శేషయ్య .

Read Also : Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

పాడిపరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ అనుబంధరంగం జీవాల పెంపకం. ఒకప్పుడు కుల వృత్తిగా ఉన్నా, ప్రస్తుతం వాణిజ్య సరళిలో చాలామంది జీవనోపాధి కోసం గొర్రెలు, మేకల ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేపే సంప్రదాయ విస్తృత పద్ధతిని , షెడ్‌లలో ఉంచి మేపే పాక్షిక సాంద్రపద్ధతులను పాటిస్తున్నారు. అయితే వర్షాకాలంలో గొర్రెలజీవాల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే. కాబట్టి జీవాలకు ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలి.. షెడ్ నిర్వాహణ ఏవిధంగా ఉండాలో తెలియజేస్తున్నారు

ముఖ్యంగా ఆరుబయట తిరిగే జీవాలు పచ్చిగడ్డిని తింటూ, గుంటలలోని నీటిని తాగుతూ, తొలకరి జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో జీవాలు పలురకాల రోగాలకు గురవుతాయి. చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పిపిఆర్‌ వంటి రోగాలు వచ్చి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి జీవాలను రక్షించడానికి యజమానులు పలురకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

వర్షాకాలంలో జీవాల పెంపకం దారులు  నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్ధికంగా ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి వ్యాధులను గుర్తించిన వెంటనే పశువైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ద్వారా రైతులు నష్టాలబారిన పడకుండా ఉంటారు.

Read Also : Kharif Castor Cultivation : ఖరీఫ్‌కు అనువైన ఆముదం రకాలు.. సాగు యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు