Soaps: మీరు వాడుతున్న సబ్బు మంచిదేనా?

మీరు వాడుతున్న సబ్బు మంచిదేనా? ఓసారి చూసుకోండి. మీరు వాడే సబ్బు ఇలా ఉందో లేదో చెక్ చేసి మరి తీసుకోండి. లేదంటే మీఇష్టం.. వాడే సబ్బులో ప్యాకింగ్‌ను ఒక్కసారి సరిగ్గా గమనించాలి.

Grade Soaps TFM : మీరు వాడుతున్న సబ్బు మంచిదేనా? ఓసారి చూసుకోండి. మీరు వాడే సబ్బు ఇలా ఉందో లేదో చెక్ చేసి మరి తీసుకోండి. లేదంటే మీఇష్టం.. వాడే సబ్బులో ప్యాకింగ్‌ను ఒక్కసారి సరిగ్గా గమనించాలి. దానిపై టీఎఫ్ఎం 70శాతం, 67శాతం, 82శాతం అని రాసి ఉందో చెక్ చేసుకోండి. అదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది.

సబ్బులో ఉన్న కొవ్వు పదార్థాల శాతం ఆధారంగా టీఎఫ్ఎం (TFM) నిర్ణయిస్తారు. అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఈ టీఎఫ్‌ఎం శాతం చాలా తక్కువగా ఉండాలి. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుంది. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ప్రకారం.. సబ్బులను 3 రకాలుగా విభజించారు.
Onion Prices : ఉల్లి ధరలు, ఎగమతుల నిషేధంపై కేంద్రం కీలక ప్రకటన

గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 అంతకు మించి శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో TFM ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వాడితే చర్మానికి హాని కలుగుతుంది.

గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే ఈ సబ్బులు సువాసనను అందిస్తాయి.
Liger: ఎన్సీబీ కంట్రోల్‌లో అనన్య.. లైగర్‌కు సెగ తప్పదా?

ట్రెండింగ్ వార్తలు