Accident To Revanth Reddy’s Convoy : రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి భారీ ప్రమాదం, ఢీకొన్న ఆరు కార్లు..

పాదయాత్ర చేస్తున్న తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

Accident To Revanth Reddys Convoy :  పాదయాత్ర చేస్తున్న తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురి అయ్యింది. ఎల్లాపూర్ మండలం తిమ్మాపూర్ స్టేజీ వద్ద సంభవించిన  ఈ ప్రమాదంలో ఆరు కార్లు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం (మార్చి4,2023)రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో 6 కార్లకు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. కానీ ఈ ప్రమాదంలో పలువురు రిపోర్టర్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాన్వాయ్ అధిక వేగంతో ప్రయాణించటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆరు కార్లు ఢీ కొట్టుకున్నాయి. కార్లలో బెలూన్లు సరైన సమయానికి ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. రిపోర్టర్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

మంత్రి కేటీఆర్‌ అడ్డా అయిన సిరిసిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. 20వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర సిరిసిల్లా జిల్లాలో జరుగనుంది. దీంట్లో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీపాద 9వ ప్యాకేజ్ సందర్శన ఉండనుంది. ఉదయం 12:30 గంటలకు క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం, జఫర్ సంఘాలతో సమావేశం జరుగనుంది. ఈక్రమంలో కాన్వాయ్ ప్రమాదానికి గురి కావటంతో ప్రాణ నష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆరు కార్లలో దాదాపు 20మంది ఉండగా పాదయాత్ర కవలర్ చేసే రిపోర్టర్లతో పాటు 10మంది గయాపడ్డారు. ‘హత్ సే హత్ జోడో’పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభించి యాత్రను కొనసాగిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు