TSPSC Paper leak: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు

ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో రవికిషోర్‭ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్‭ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు.

TSPSC Paper leak: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీరుగా పని చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో రవికిషోర్‭ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్‭ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు. రమేష్ ప్రశ్నా పత్రాలను మరో ఇరవై మందికి అమ్మినట్టుగా గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు