Chandoo Mondeti : ఎన్టీఆర్ తో పీరియాడిక్ యాక్షన్ సినిమా చేయాలి.. కథ కూడా రెడీగా ఉంది..

దేవర రెండు పార్టులు, వార్ 2 సినిమా, ప్రశాంత్ నీల్ తో సినిమా.. ఇలా వరుసగా భారీ సినిమాలని లైన్లో పెట్టారు ఎన్టీఆర్.

Chandoo Mondeti : ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. RRR తర్వాత రాబోయే దేవర సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. దేవర(Devara) రెండు పార్టులు, వార్ 2 సినిమా, ప్రశాంత్ నీల్ తో సినిమా.. ఇలా వరుసగా భారీ సినిమాలని లైన్లో పెట్టారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ తో ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తానంటున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి.

అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చిన చందూ మొండేటి కార్తికేయ సినిమాతో డైరెక్టర్ గా మారి హిట్ కొట్టాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి ఇటీవల కార్తికేయ 2 సినిమాతో నేషనల్ వైడ్ భారీ హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. చందూ ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read : Chiranjeevi : పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దు.. 22 ఏళ్ళ క్రితం వీడియో షేర్ చేసిన మెగాస్టార్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందూ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారితో పీరియాడిక్ యాక్షన్ సినిమా చేయాలి. ఆల్రెడీ కథ కూడా రెడీగా ఉంది. ఆ సినిమా చేయడం అనేది ఎన్టీఆర్ చేతిలోనే ఉంది. అది ఎన్టీఆర్ గారు ఓకే చేస్తే టెర్రిఫిక్ గా ఉంటుంది ఆ సినిమా అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చందూ మొండేటి కథ ఎన్టీఆర్ ఓకే చేస్తే అదిరిపోయే పీరియాడిక్ యాక్షన్ సినిమా వస్తుందని, ఈ సినిమా ఓకే అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.

ట్రెండింగ్ వార్తలు