Chiranjeevi : పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దు.. 22 ఏళ్ళ క్రితం వీడియో షేర్ చేసిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేస్తూ మేడే శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi : పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దు.. 22 ఏళ్ళ క్రితం వీడియో షేర్ చేసిన మెగాస్టార్..

Megastar Chiranjeevi Shares a 22 Years old Video on May Day

Chiranjeevi : నేడు మేడే సందర్భంగా సోషల్ మీడియాలో కూడా పలువురు ప్రముఖులు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేస్తూ మేడే శుభాకాంక్షలు తెలిపారు. 22 ఏళ్ళ క్రితం ఓ ఆర్గనైజేషన్ కి చిరంజీవి చేసిన యాడ్ వీడియో ఇది.

Also Read : Anupam Kher : నా ఫేవరేట్ యాక్టర్ అంటూ.. ఎన్టీఆర్‌తో ఫోటో దిగిన బాలీవుడ్ సీనియర్ నటుడు..

ఆ వీడియోలో పిల్లల్ని పనికి పంపకుండా చదువుకోడానికి స్కూల్ కి వెళ్ళాలి అనే సారాంశం ఉంది. ఈ వీడియోని చిరంజీవి షేర్ చేస్తూ.. 22 సంవత్సరాల క్రితం పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోసం చేసిన ‘చిన్ని చేతులు’ క్యాంపైన్ వీడియో ఇది. ఈ రోజుకీ కూడా ఈ వీడియో పనికొస్తుందనిపించి షేర్ చేస్తున్నాను. చైల్డ్ లేబర్ ని ఎంకరేజ్ చేయకండి. హ్యాపీ మేడే అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.