Anupam Kher : నా ఫేవరేట్ యాక్టర్ అంటూ.. ఎన్టీఆర్‌తో ఫోటో దిగిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Anupam Kher : నా ఫేవరేట్ యాక్టర్ అంటూ.. ఎన్టీఆర్‌తో ఫోటో దిగిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

Bollywood Star Actor Anupam Kher Shares Photo with Jr NTR Photo goes Viral

Updated On : May 1, 2024 / 11:13 AM IST

Anupam Kher : ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాడు. ముంబై నుంచి ఎన్టీఆర్ ఫోటోలు రోజూ వస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. బాలీవుడ్(Bollywood) లో అది కూడా స్పై యాక్షన్ సినిమాలో హృతిక్ ఎన్టీఆర్ కలిసి చేస్తుండటంతో వార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఎన్టీఆర్, భార్య ప్రణతి ముంబైలో బాలీవుడ్ డిన్నర్ పార్టీకి వెళ్లగా అక్కడి నుంచి కూడా ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.

తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు అనుపమ్ ఖేర్. నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి గౌరవ పతకాలని, ఎన్నో అవార్డుని అందుకున్నారు. ఇటీవల తెలుగులో కార్తికేయ 2 సినిమాలో శ్రీకృష్ణుడి గురించి చెప్పే సన్నివేశంలో కనిపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి సినిమాలల్లో చేస్తున్నారు ఆయన.

Also Read : Naveen Chandra : బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న హీరో.. ఎయిర్ పోర్ట్‌లో భార్య ఎలా సర్‌ప్రైజ్ ఇచ్చిందో చూడండి..

ముంబైలో ఎన్టీఆర్ తో దిగిన ఫోటోని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా ఫేవరేట్ పర్సన్, యాక్టర్ ఎన్టీఆర్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను మరింత ఎదగాలి లైఫ్ లో అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు బయటకి రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

దీనికి రిప్లై ఇస్తూ.. నేనెప్పుడూ అభిమానించే మీ వర్క్ చాలా గ్రేట్ సర్. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండాలి అని అనుపమ్ ఖేర్ పోస్ట్ రీ షేర్ చేస్తూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.