Naveen Chandra : బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న హీరో.. ఎయిర్ పోర్ట్‌లో భార్య ఎలా సర్‌ప్రైజ్ ఇచ్చిందో చూడండి..

ఢిల్లీలో అవార్డు తీసుకొని తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్ట్ లో నవీన్ చంద్ర భార్య ఓర్మా సర్ ప్రైజ్ ఇచ్చింది.

Naveen Chandra : బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న హీరో.. ఎయిర్ పోర్ట్‌లో భార్య ఎలా సర్‌ప్రైజ్ ఇచ్చిందో చూడండి..

Naveen Chandra Wife Orma Supersized him after Receiving Best Actor Award

Updated On : May 1, 2024 / 6:41 PM IST

Naveen Chandra : కొత్త కొత్త పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అన్ని రకాల పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నవీన్ చంద్ర గత సంవత్సరం ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవీన్ చంద్ర, స్వాతి, శ్రావ్య నవేలి, జ్ఞానేశ్వరి, హర్ష.. పలువురు ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో మంత్ ఆఫ్ మధు సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

తాజాగా ఈ మంత్ ఆఫ్ మధు సినిమాలోని నటనకు గాను నవీన్ చంద్ర బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫీచర్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మెల్ యాక్టర్ అవార్డు నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు సినిమాకు అందుకున్నాడు. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన సోషల్ మీడియాలో తెలిపారు. అయితే ఢిల్లీలో అవార్డు తీసుకొని తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్ట్ లో నవీన్ చంద్ర భార్య ఓర్మా సర్ ప్రైజ్ ఇచ్చింది.

Naveen Chandra Wife Orma Supersized him after Receiving Best Actor Award

Also Read : Chiranjeevi – Surekha : కష్టపడి ఆవకాయ పచ్చడి చేసినందుకు భార్యని దుబాయ్ ట్రిప్ కి తీసుకెళ్తున్న మెగాస్టార్..

నవీన్ చంద్ర భార్య ఓర్మా బొకే తీసుకువెళ్లి ఎయిర్ పోర్ట్ లో తన భర్త కోసం ఎదురుచూసింది. సడెన్ గా తన భార్య ఎయిర్ పోర్ట్ లో అలా ఫ్లవర్ బొకేతో కనపడటంతో నవీన్ చంద్ర ఆశ్చర్యపోయాడు. తాను అందుకున్న అవార్డుని భార్యకు తీసి చూపించాడు. ఇద్దరూ ప్రేమగా కౌగలించుకున్నారు. ఈ వీడియోని నవీన్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. క్యూట్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naveen Chandra (@naveenchandra212)

ఇక ఇటీవలే నవీన్ చంద్ర ఇన్స్పెక్టర్ రుషి అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో వచ్చి అదరగొట్టారు. ప్రస్తుతం నవీన్ చంద్ర చేతిలో గేమ్ ఛేంజర్ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇటు సినిమాల్లోనూ, అటు సిరీస్ లలోనూ దూసుకుపోతున్నాడు.