Chiranjeevi – Surekha : కష్టపడి ఆవకాయ పచ్చడి చేసినందుకు భార్యని దుబాయ్ ట్రిప్ కి తీసుకెళ్తున్న మెగాస్టార్..
సమ్మర్ లో ఎవరైనా ఆవకాయ తినాల్సిందే. చిరంజీవి ఫ్యామిలీ కూడా ఆవకాయ ఆవురావురుమంటూ తినాల్సిందే.

Megastar Chiranjeevi and his Wife Surekha will go for Dubai Trip after making Mango Pickle
Chiranjeevi – Surekha : మెగా ఫ్యామిలీలో(Mega Family) అందరూ సినిమాలు, బిజినెస్ లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా టైం ఇస్తారు. అప్పుడప్పుడు ట్రిప్స్ కి వెళ్తుంటారు కూడా. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, చిరంజీవి తల్లి అంజనా దేవి, రామ్ చరణ్ భార్య ఉపాసన(Upasana) కలిసి ఇటీవల అత్తమ్మాస్ కిచెన్ అని ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి ప్రమోషన్స్ కూడా అందరూ చాలా దగ్గరుండి యాక్టివ్ గా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో సురేఖ, ఉపాసన, చిరంజీవి తల్లి అంజనా దేవి.. ఇలా అందరూ భాగమవుతున్నారు.
Also Read : Thiruveer – Kalpana Rao : హీరో తిరువీర్ పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు చూశారా?
ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైంది. సమ్మర్ లో ఎవరైనా ఆవకాయ తినాల్సిందే. చిరంజీవి ఫ్యామిలీ కూడా ఆవకాయ ఆవురావురుమంటూ తినాల్సిందే. తాజాగా ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. చిరంజీవి సతీమణి సురేఖ ఇంట్లోకి, అత్తమ్మస్ కిచెన్ కి కలిపి స్పెషల్ గా ఆవకాయ పచ్చడి దగ్గరుండి చేయించింది. ఆ తర్వాత ఆవకాయ అన్నంలో కలిపి అక్కడ ఉన్న వారందరికీ టేస్ట్ చేయించారు. చిరంజీవి తల్లి సురేఖ ఆవకాయ పచ్చడి చాలా బాగా చేసింది అని మెచ్చుకున్నారు.
అనంతరం ఉపాసన.. అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ సురేఖని అడగడంతో దుబాయ్ వెళ్తున్నాను, మీ మామయ్య తీసుకెళ్తున్నారు. కష్టపడి ఆవకాయ పచ్చడి చేసినందుకు, మిగిలిన వర్క్స్ తో బాగా కష్టపడుతున్నందుకు హాలిడే ట్రిప్ కి వెళ్తున్నాము అని తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక పలువురు నెటిజన్లు కష్టపడి ఆవకాయ చేసింనందుకు దుబాయ్ ట్రిప్ కి వెళ్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొంతమంది మాకు కూడా ఆవకాయ పచ్చడి తినాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి, సురేఖ దుబాయ్ ట్రిప్ కి వెళ్తుండటంతో కొన్ని రోజులు విశ్వంభర షూట్ కి బ్రేక్ పడనుంది. ఇటీవలే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో దాదాపు 26 రోజుల పాటు షూట్ చేశారు.