బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్‌దారుల నగదును జమ చేయాలని నిర్ణయం.. ‘మే’డే బ్యాంకులు బంద్

Pensions: వృద్ధులతో పాటు దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి..

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారుల నగదును వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, మే డే కావడంతో ఇవాళ బ్యాంకులకు సెలవు దినం. దీంతో పెన్షన్ నగదు రేపు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది.

బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దనే నగదు పంపిణీ చేయనున్నారు. అలాగే, వృద్ధులతో పాటు దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేస్తారు.

కాగా, ఎన్నికల వేళ ఏపీ వ్యాప్తంగా గత నెల అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పెన్షన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నెల అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వికలాంగులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత నెల పెన్షన్ల కోసం చాలా మంది సచివాలయాల వద్ద క్యూలైన్లలో చాలా సేపు నిలబడాల్సి వచ్చింది. దీంతో పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నారు.

Also Read: ఈ 3 నియోజక వర్గాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలు

ట్రెండింగ్ వార్తలు